Site icon HashtagU Telugu

Gangavva : బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వపై కేసు నమోదు..ఎందుకంటే..!!

Gangavva Case

Gangavva Case

తెలుగు ‘బిగ్ బాస్ ‘ సీజన్ 8 కంటెస్టెంట్ గంగవ్వ, యూట్యూబర్ రాజుపై వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972) కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. గతంలో వారు తమ యూట్యూబ్ ఛానల్లో చిలక జోస్యం చెప్పించారు. అది మూగజీవాలను హింసించడం కిందికే వస్తుందంటూ జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ జగిత్యాల అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును అనుసరించి గంగవ్వ, రాజుపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

గంగవ్వ (Gangavva ) ఈమె గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం.. జగిత్యాల జిల్లా లోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన ఈమె..పెద్దగా చదువు కోకపోయిన..తన మాట తీరు తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. వ్యవసాయం చేసుకుంటూ ఉండే ఈమె జీవితాన్ని బిగ్ బాస్ షో (Bigg Boss Show) మార్చేసింది. అప్పటి వరకు మై విలేజ్‌ షో (My Village Show) అనే యూట్యూబ్ ఛానల్ లో యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకోగా..ఆ గుర్తింపు తో బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేసింది. ఈ షో తో మరింత పాపులర్ అయ్యింది. ఈ షో నుండి బయటకు వచ్చాక సినిమా ఛాన్సులు సైతం తలుపు తట్టాయి. అలాగే ఈ షో ద్వారా భారీగానే రెమ్యూనరేషన్ తెచ్చుకుంది. ప్రస్తుతం యూట్యూబ్ వీడియో తో పాటు అప్పుడప్పుడు వెండితెరపై కనిపిస్తూ వస్తుంది.

Read Also : Chhota Rajan : ఛోటా రాజన్‌కు బెయిల్.. జీవితఖైదు శిక్ష రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు