Johnny Master : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు..

Johnny Master : తనపై జానీ మాస్టర్.. లైంగిక దాడి చేస్తున్నారంటూ 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది

Published By: HashtagU Telugu Desk
Case Filed On Choreographer

Case Filed On Choreographer

Case Filed On Choreographer Jani Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) పై లైంగిక వేధింపుల కేసు (Harassment Case) నమోదైంది. నెల్లూరు (Nellore) నగరానికి చెందిన జానీ ఈటీవీ లో ప్రసారమైన ఢీ డాన్స్ షో (Dhee Dance Show) తో పాపులర్ అయ్యాడు. ఆ షో లో జానీ టాలెంట్ చూసిన అల్లు అర్జున్ తన సినిమాల్లో మొదటగా ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస పెట్టి అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ..అతి తక్కువ టైంలోనే టాప్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తెలుగు లోనే కాదు ఇతర భాషల్లోనూ అగ్ర హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తూ వస్తున్నాడు.

అలాంటి జానీ మాస్టర్ పై ఓ యువతీ లైంగిక వేధింపుల పిర్యాదు చేసింది. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్.. లైంగిక దాడి చేస్తున్నారంటూ 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది. ఔట్ డోర్ షూటింగ్స్ లలో తనపై అత్యాచారం చేశాడంటూ రాయ్ దుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయ్ దుర్గం పోలీసులు.. నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి ట్రాన్స్ ఫర్ చేసినట్టు సమాచారం. చెన్నై, ముంబై లలో ఔట్ డోర్ షూటింగ్స్ లతో పాటు.. హైదరాబాద్ నార్సింగ్ లోని తన ఇంటి లో సైతం.. జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని సదరు మహిళా డాన్సర్ వాపోతుంది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ పై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323)లోని క్లాజ్ (2) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరి దీనిఫై జానీ ఏమంటాడో చూడాలి.

Read Also : 100 Days of Modi: మోడీ మొదటి 100 రోజుల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు

  Last Updated: 16 Sep 2024, 03:45 PM IST