Site icon HashtagU Telugu

Pushpa : సమంత స్పెషల్ సాంగ్ పై ‘పురుషుల సంఘం’ కేసు

samantha

samantha

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న విడుదలవుతోంది. అయితే విడుదలకు ముందే సినిమాపై చిన్న వివాదం నెలకొంది. రిపోర్ట్స్ ప్రకారం.. సమంత స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా, ఊఊ అంటావా’ పై పురుషుల సంఘం కేసు పెట్టింది. సాహిత్యం, విజువల్స్ ద్వారా పురుషులను కామ పురుషులుగా చిత్రీకరించినందుకు పాటపై దావా వేయబడింది.

ఈ పాటను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ కోర్టులో ‘పురుషుల సంఘం’ డిమాండ్ చేయగా, కోర్టులో ఇంకా కేసు పరిష్కారం కాలేదు. ఇది సమంతా రూత్ ప్రభు మొట్ట మొదటి ఐటెం సాంగ్. దురదృష్టవశాత్తూ పాటలోని దాని సాహిత్యం, విజువల్స్ కారణంగా ఇది వివాదాస్పదమైంది. పలు భాషల్లో విడుదలైన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, వివేకా, చంద్రబోస్ లిరిక్స్ అందించారు. పుష్ప: ది రైజ్‌ని ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. అలాగే మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ ప్రధాన ప్రతినాయకుడిగా నటించిన పుష్ప తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. పుష్ప అనేది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే యాక్షన్ డ్రామా.

Exit mobile version