Manchu Mohan Babu: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన మంచు ఫ్యామిలీ వివాదంలో మోహన్ బాబుకు (Manchu Mohan Babu) షాక్ తగిలింది. మంచు మోహన్ బాబుకు పహాడి షరీఫ్ పోలీసులు షాక్ ఇచ్చారు. మీడియాపై దాడి చేసినందుకు మోహన్ బాబుపై పహాడి షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. హన్ బాబుపై 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి మనోజ్‌తో పాటు మోహన్ బాబు ఇంట్లోకి ప్రవేశించిన పలువురు ప్రతినిధులపై ఆయన దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు ప్రతినిధులకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమందికి స్వల్ప గాయాలు కాగా.. కెమెరాలు, మైక్‌లు ధ్వంసం అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో ఒక జర్నలిస్టు చెవికి సర్జరీ చేయాల్సి ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్ జల్‌పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద మీడియాపై జరిగిన దాడి ఘటనను పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే ఆయనతోపాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి విచారణకు రావాలంటూ ఇప్పటికే మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌లకు రాచకొండ పోలీసులు నోటీసులిచ్చారు.
Also Read: Eyelash Dandruff : కనురెప్పలపై చుండ్రు? మీరు దీని గురించి విన్నారా?
ఇప్పటికే మోహన్ బాబు.. మనోజ్‌కు సంబంధించి ఓ ఆడియో నోట్‌ను కూడా విడుదల చేశారు. అందులో నువ్వు నాకు ఇష్టమైన కొడుకువిరా. నీ భార్య మాటలు విని నువ్వు ఇలా అయిపోయావు. తాగుడుకు బానిస అయ్యావు. అందరికంటే ప్రేమగా నిన్నే చూసుకున్నాను. నువ్వు చేస్తున్న ఈ అల్లరి చూసి మీ అమ్మ ఆస్పత్రి పాలైంది. ఇప్పటికే రెండు సార్లు మారతానని ప్రామిస్ చేశావు. కానీ నీ పద్దతితో ఎలాంటి మార్పు రావటంలేదు. ప్రతి ఫ్యామిలీలో ఉండే గొడవలే ఇవి. వీటిని జర్నలిస్టు సోదరులు పెద్దది చేయకండి అని ఆయన ఆడియో నోట్‌లో తెలిపారు.
మనోజ్‌ను గన్‌తో బెదిరించిన మోహన్ బాబు
గత రాత్రి జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. ఈ హైడ్రామాలో మనోజ్ తన తండ్రి ఇంటి గేట్లను తోసుకుంటూ లోపలకి వెళ్లారు. ఈ సమయంలోనే మోహన్ బాబు, మనోజ్ మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మనోజ్‌పై దాడి చేయడమే కాకుండా గన్‌తో కూడా మోహన్ బాబు బెదిరించినట్లు తెలుస్తోంది. మరీ ఈ మంచు ఫ్యామిలీ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలియాల్సి ఉంది.