ఈ మధ్య టాలీవుడ్ హీరోల పై వరుసగా పోలీస్ కేసులు (Police Case) నమోదు అవుతుండడం అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏకంగా అల్లు అర్జున్ జైల్లో ఓ రోజు గడపాల్సి వచ్చిన ఘటన దేశ వ్యాప్తంగా వైరల్ గా మారగా..తాజాగా హీరో వెంకటేష్ (Venkatesh) ఫ్యామిలీ హీరోలపై కూడా కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై ప్రముఖ సినీ నటులు వెంకటేశ్, రానా, అభిరామ్, సురేశ్ బాబులపై సిటీ సివిల్ కోర్టులో కేసు నమోదైంది. నందకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్న డెక్కన్ కిచెన్ కూల్చివేయడం నేపథ్యంలో వివాదం తలెత్తింది.
Morning Workout Tips : ఉదయం ఖాళీ కడుపుతో వ్యాయామం చేసే బదులు ఇలా చేయండి..!
నందకుమార్ డెక్కన్ కిచెన్ ను లీజుకు తీసుకున్నప్పటికీ, అక్కడి వ్యాపారం కూల్చివేసినట్టు ఆరోపణలు చేయడంతో కోర్టుకు వెళ్లారు. ఈ అంశంపై విచారణ జరుగుతుండగా, కోర్టు ఫిలింనగర్ పోలీసులను కేసు నమోదు చేయమని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశంతో పోలీసులు వెంకటేష్ , రానా , అభిరాం లపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. ప్రముఖ నటులపై కేసు నమోదు కావడం అనేక చర్చలకు దారితీసింది. ఈ ఘటనపై నందకుమార్, ఇతర నిందితులు తమ వ్యాఖ్యలను తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ జనవరి 14 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో వెంకీ పై కేసు నమోదు కావడం చర్చ గా మారింది.