Vijay Deverakonda: టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)పై SC/ST (అట్రాసిటీ నివారణ) చట్టం కింద హైదరాబాద్‌లోని SR నగర్ పోలీస్ స్టేషన్‌లో గతంలో కేసు నమోదైంది. ఏప్రిల్ 26, 2025న జరిగిన సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ చేసిన వ్యాఖ్యలు గిరిజన సమాజాన్ని అవమానించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈవెంట్‌లో కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ.. “500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు, తీవ్రవాదులు బుద్ధిలేకుండా పోరాడుతున్నారు” అని విజయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు గిరిజనులను తీవ్రవాదులతో పోల్చాయని, వారి గుర్తింపును కించపరిచాయని తెలంగాణ ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషన్ రాజ్ చౌహాన్ ఆరోపించారు.
మే 1, 2025న న్యాయవాది లాల్ చౌహాన్ SR నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు మే 3న జనరల్ డైరీ ఎంట్రీ చేసి, తర్వాత కేసు నమోదు చేశారు. గిరిజన సంఘాలు విజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి, క్షమాపణ డిమాండ్ చేశాయి. మే 3, 2025న విజయ్ Xలో ప్రకటన విడుదల చేసి, తన వ్యాఖ్యలు ఎవరినీ గాయపరచే ఉద్దేశంతో చేయలేదని, “ట్రైబ్” అనే పదం చారిత్రక అర్థంలో ఉపయోగించానని, షెడ్యూల్డ్ ట్రైబ్స్‌ను ఉద్దేశించలేదని వివరించారు. ఇబ్బంది వాడినవారికి క్షమాపణలు తెలిపారు. అయినప్పటికీ కేసుపై విచారణ కొనసాగుతోంది. విజయ్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం ‘కింగ్‌డమ్’పై దృష్టి పెట్టారు.
Also Read: RGIA: ఇరాన్ రూట్ మూసివేత.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం ఆలస్యం
తాజాగా రాయదుర్గంలో కేసు నమోదు
ఇదే విషయంపై తాజాగా హీరో విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గిరిజన సంఘాల ఆందోళనతో రాయదుర్గం పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఈ కేసుపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.