Site icon HashtagU Telugu

Singer Chinmayi: సింగర్ చిన్మయిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు

Case Against Singer Chinmay

Case Against Singer Chinmay

 

Singer Chinmayi : స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ నిత్యం హాట్ టాపిక్ గా ఉంటుంటారు. తాజాగా ఈమె తెలుగు సీనియర్ నటి ‘అన్నపూర్ణమ్మ’(Annapurnamma)ని విమర్శిస్తూ రిలీజ్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన HCU విద్యార్థి కుమార్ సాగర్.. చిన్మయి వ్యాఖ్యలను ఖండిస్తూ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు.

అసలు విషయం ఏంటంటే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. “ఆడవాళ్లు అర్ధరాత్రుళ్లు బయట తిరగాల్సిన అవసరం ఏముంది..? ఆఫీస్‌ల్లో పని చేస్తున్నారని చెబుతూ చిన్న చిన్న బట్టలు వేస్తారు. ఎప్పుడు ఎదుటివారిని తప్పుబట్టడం సరికాదు. మనలో కూడా కొంచెం తప్పు ఉంటుంది” అంటూ ఇప్పటి మోడరన్ కల్చర్ ని ఫాలో అయ్యే అమ్మాయిలని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు.

ఇక, ఈ కామెంట్స్ పై రియాక్ట్ అవుతూ చిన్మయి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. “అన్నపూర్ణమ్మ గారు అంటే నాకు అభిమానం ఉంది. కానీ ఆమె కూడా అమ్మాయిల వేష‌ధార‌ణ గురించి మాట్లాడుతూ.. దాని వల్లే అఘాయిత్యాలు జ‌రుగుతున్నాయ‌ని చెబుతుండడం నాకు నవ్వు తెప్పిస్తుంది. అసలు ఈ దేశంలో అమ్మాయిలుగా పుట్ట‌డం మ‌న క‌ర్మ” అంటూ వైరల్ కామెంట్స్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

చిన్మయి చేసిన ఈ కామెంట్స్ పై HCU విద్యార్థి కుమార్ సాగర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసు కంప్లైంట్ ఇచ్చాడు. భారతదేశంలో పుట్టి, ఇక్కడి గాలి పిలుస్తూ, ఇక్కడే ఉంటూ ఇక్కడ సౌకర్యాలు పొందుతూ.. తిరిగి భారతదేశం ఒక స్టుపిడ్ కంట్రీ, ఇక్కడ పుట్టడం నా కర్మ అంటూ సింగర్ చిన్మయి చేసిన వ్యాఖ్యలు నాకు బాధ కలిగించాయి. నా దేశాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఆమె పై చర్యలు తీసుకోవాలంటూ కుమార్ సాగర్ కంప్లైంట్ లో పేర్కొన్నాడు.

read also : AP Politics: ఆరోపణలు నిరూపించు పవన్: పేర్ని నాని