Site icon HashtagU Telugu

Hero Raj Tarun: హీరో రాజ్ త‌రుణ్‌- లావ‌ణ్య కేసులో బిగ్ ట్విస్ట్..!

Hero Raj Tarun

Hero Raj Tarun

Hero Raj Tarun: హీరో రాజ్ త‌రుణ్‌- లావ‌ణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. హీరో రాజ్‌తరుణ్ (Hero Raj Tarun), లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ త‌యారుచేశారు. ఈ ఛార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్‌తరుణ్‌ పదేళ్లు సహజీవనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పదేళ్లపాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నార‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయన్నారు. లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించిన త‌ర్వాత ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ త‌రుణ్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్న విష‌యం తెలిసిందే.

ఇక‌పోతే టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్‌ పై అతని ప్రేయసి లావణ్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. రాజ్ త‌రుణ్ త‌న‌ను పెళ్లి చేసుకున్నాడ‌ని, ఓ బాలీవుడ్ న‌టితో ఎఫైర్ కార‌ణంగా త‌న‌ని దూరం పెడుతున్నాడ‌ని లావ‌ణ్య పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు నార్సింగి పోలీస్ స్టేష‌న్‌లో రాజ్ త‌రుణ్‌పై ఎఫ్ఐఆర్ కూడా న‌మోదైంది. అయితే లావ‌ణ్య చెప్పేవి అన్నీ అబ‌ద్ధాల‌ని, ఆమెకు డ్ర‌గ్స్ అల‌వాటు ఉంద‌ని.. అందుకే ఆమెతో దూరంగా ఉంటున్న‌ట్లు రాజ్ త‌రుణ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యవహారం ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Also Read: Dogs Hate Color : ఈ రంగు చూస్తే ఎద్దుకే కాదు.. కుక్కకి కూడా కోపం వస్తుంది..! రోడ్డు మీద నడిచేటప్పుడు జాగ్రత్త!

నార్సింగి పోలీసులకు లావణ్య ఇప్ప‌టికే ఇవ్వాల్సిన ఆధారాలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం ప్ర‌కారం.. 170 ఫొటోలు, సాంకేతిక ఆధారాలను లావ‌ణ్య పోలీసులకు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఐపీసీ 493 సహా మరికొన్ని సెక్షన్ల కింద రాజ్ త‌రుణ్‌పై కేసు నమోదు చేశారు. తాజాగా పోలీసులు ఛార్జీషీట్ దాఖ‌లు చేయ‌డంతో రాజ్‌తరుణ్‌-లావణ్య విష‌యం ఎటువైపు డైవ‌ర్ట్ అవుతుంద‌నేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ‌త కొన్ని రోజుల‌గా లావ‌ణ్య‌, ఆర్జే శేఖ‌ర్ బాషా మీడియా ముందుకు వ‌చ్చి చేసిన ర‌చ్చ తెలిసిందే. లావ‌ణ్య‌కు డ్ర‌గ్స్‌తో సంబంధం ఉంద‌ని, అందుకే ఆమెను పోలీసులు 45 రోజుల‌పాటు జైలులో ఉంచార‌ని శేఖ‌ర్ బాషా చెప్పిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం శేఖ‌ర్ బాషా బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నాడు.