Site icon HashtagU Telugu

Captain Miller: తెలుగులో కెప్టెన్ మిల్లర్ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే!

Miller

Miller

Captain Miller: హీరో ధనుష్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ తెరకెక్కించిన పీరియాడిక్ సాలిడ్ యాక్షన్ డ్రామా “కెప్టెన్ మిల్లర్” కోసం తెలిసిందే. మరి తమిళ నాట భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మేకర్స్ టాలీవుడ్ లో నెలకొన్న భారీ పోటీ నిమిత్తం వాయిదా వేశారు.

దీంతో కెప్టెన్ మిల్లర్ రిలీజ్ వాయిదా వేశారు తప్పితే రిలీజ్ మాత్రం ఆపలేదు అని కన్ఫర్మ్ అయ్యింది. లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా తెలుగులో ఈ జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టుగా కొత్త డేట్ ని అనౌన్స్ చేశారు. మరి తెలుగులో ఈ చిత్రంని సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఆసియన్ డిస్ట్రిబ్యూటర్స్ వారు రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ భారీ చిత్రంలో శివ రాజ్ కుమార్, యంగ్ హీరో సందీప్ కిషన్ తదితరులు నటించగా జివి ప్రకాష్ సంగీతం అందించాడు.

విభిన్నమైన సినిమాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న హీరోనే ధనూష్. చాలా ఏళ్లుగా కోలీవుడ్‌లో వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో మంచి ఉత్సాహంతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమాను చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది బ్రిటీష్ నేతృత్వంలోని భారత సైన్యంపై దురాగతాన్ని చూసి పోరాడే వ్యక్తి కథతో రూపొందినట్లు తెలిసింది.