Kangana Ranaut: బాత్రూం కష్టాలు భరించలేక లగ్జరీ కార్వాన్ కొన్నా: కంగనా రనౌత్

కంగనా రనౌత్ తన సినిమా కష్టాలను షేర్ చేసుకుంది. ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ లో తాను పడిన కష్టాలను గుర్తు చేసుకుంది.

  • Written By:
  • Publish Date - March 21, 2023 / 03:20 PM IST

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తన సినిమా కష్టాలను షేర్ చేసుకుంది. ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ లో తాను పడిన కష్టాలను గుర్తు చేసుకుంది. రంగూన్ అనే సినిమా షూటింగ్ కోసం అరుణాచల్ ప్రదేశ్ లో వెళ్లాల్సి వచ్చిందని, మారుమూల గ్రామం కావడంతో చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపింది. సరైన వసతులు లేకపోవడంతో మూవీ టీమ్ అంతా పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య బహిర్భూమి, ఇతర అవసరాలు తీర్చుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఇక తాను కూడా బండరాళ్ల మధ్యనే బహిర్భూమికి వెళ్లానని కంగనా పేర్కొంది. ఆ కష్టాలు భరించలేక తాను లగ్జరీ కార్వాన్ కొనుగోలు చేశానని బాలీవుడ్ క్వీన్ తెలియజేసింది.

అయితే కేతన్ రావల్ బాలీవుడ్ నటుల కోసం ప్రత్యేకంగా క్యారవాన్‌లను డిజైన్స్ చేస్తుంటాడు. బాలీవుడ్ లో ఇతర స్టార్స్ తో పోల్చితే కంగనా రనౌత్ కార్వాన్ ఖరీదైన, విలాసవంతమైనదిగా ఉంటుంది. జస్ట్ కార్వాన్ ఇంటీరియర్ కోసమే కంగనా 65 లక్షలు ఖర్చు చేసిందట. వ్యాన్ లోని సోఫాలు, ఛెయిర్లు అన్నీ.. ఒరిజినల్ టేక్ వుడ్ తో తయారు చేశామని చెబుతున్నారు కేతన్.

కారవాన్ ఇంటీరియర్ కోసం ఇంత భారీ ధరను మరే ఇతర సెలబ్రిటీ లేదా నటుడు చెల్లించలేదు. బాలీవుడ్ ప్రముఖుల కోసం మాత్రమే కాకుండా అంబానీ కుటుంబ సభ్యుల కోసం కూడా కార్వాన్స్ డిజైన్ చేసిన కేతన్ రావల్, కంగనా కారవాన్‌లో అత్యంత ఖరీదైన ఇంటీరియర్ ఉందని పేర్కొన్నాడు. ఈ పరిశ్రమలో, స్టార్ హీరోలు మరియు హీరోయిన్‌లకు షూటింగ్ లొకేషన్‌ల కోసం ప్రత్యేకమైన కారవాన్‌లు అవసరం, వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది.