Hero Vijay : తమిళ రాజకీయాల్లో ‘విజయ’ఢంకా మోగించబోతున్నాడా?

రాజకీయల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ , కమల్ హాసన్ నిలదోక్కుకోలేని చోట విజయ్ విజయఢంకా మోగించ బోతున్నాడా. గత నెల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే ఇందుకు ఉదాహరణ.

  • Written By:
  • Updated On - November 3, 2021 / 12:59 PM IST

రాజకీయల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ , కమల్ హాసన్ నిలదోక్కుకోలేని చోట విజయ్ విజయఢంకా మోగించ బోతున్నాడా. గత నెల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే ఇందుకు ఉదాహరణ. ఒక వైపు విభిన్న పాత్రలు చేస్తూ తన మార్క్ నటనతో తలపతిగా మారిన విజయ్ రాజకీయాల్లో కూడా తన చారిష్మా చూపుతున్నారు. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 169 స్థానాల్లో DMK దాని మిత్ర పక్షం అయిన అలిండియా తలపతి విజయ్ మక్కల్ ఐయ్యం 115 స్థానాలు కైవసం చేసుకుంది.VMI (విజయ్ మక్కల్ ఐయ్యం) ఇందులో 68% సీట్లు సొంతం చేసుకోగా 115 స్థానాల్లో దాదాపు 45 మంది మహిళలు ఉండటం విశేషం.

తమిళనాట రాజకీయాల కు సినిమాలకు విడదీయరాని బంధం ఉంటుంది. ఎస్ఎస్ రాజేంద్రన్, శివాజీ గణేషన్, ఎంజి రామచంద్రన్, జయలలిత, కెప్టెన్ విజయ్ కాంత్, కమల్ హాసన్  లాంటి ఎవర్ గ్రీన్ స్టార్స్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసారు. కొందరు sucess అయితే మరికొందరు కాలేకపోయారు. రాజకీయాల్లో తన మార్క పాలన ద్వారా, తమిళ ప్రజల హృదయ్యాల్లో అమ్మగా నిలిచింది జయలలిత. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా తన నటనతో అభిమానుల మనసు గెలిచిన కమల్ హాసన్ రాజకీయాల్లో అంతగా రాణించలేకపోయారు. కమల్ పార్టీ- మక్కల్ నిధి మయ్యం లోకల్ ఎన్నికల్లో  విజయం దక్కించు కోలేక చేతికిలా పడింది.

సినిమాల్లో రజినీ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించిన విజయ్, రాజకీయాల్లో MGR తర్వాత  నెంబర్2 గా మారి అంతటి చరిత్ర సృష్టించ బోతున్నాడా.. అనే చర్చ జరుగుతుంది. పారితోషికం తీసుకోవడంలో దక్షిణాదిలో అందరి కంటే ముందు ఉన్న విజయ్, 27 ఏళ్ల క్రితం VMI పార్టీ పెట్టి వివిధ సేవ కారక్రమాలు  చేయడంలో కూడా ముందే ఉన్నారు. లోకల్ ఎన్నికల ఫలితాలు చూశాక తమిళనాటా ఇక త్రిముఖ పోటీ తప్పక పోవొచ్చు అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.