ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైల‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?!

పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కలయికలో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Ustaad Bhagat Singh Trailer

Ustaad Bhagat Singh Trailer

Ustaad Bhagat Singh: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం..చిత్ర బృందం మార్చి రెండో వారంలో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అంతకంటే ముందే ఫిబ్రవరి 22న ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ (Aura of Ustaad) అనే రెండో సింగిల్‌ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ధృవీకరించారు. ఇక నుంచి సినిమాకు సంబంధించి వరుసగా బ్యాక్-టు-బ్యాక్ అప్‌డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఆస్తమా హెచ్చరిక సంకేతాలివే..!

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు దశరథ్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో పార్తీబన్, అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్ కనిపిస్తారు.

పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కలయికలో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ వేసవిలో బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ జాతర ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  Last Updated: 17 Feb 2026, 11:25 PM IST