Jr NTR & Ramcharan: కాఫీ విత్ కరణ్ కు నో చెప్పిన ఎన్టీఆర్, రామ్ చరణ్.. కారణమిదే!

బాలీవుడ్ అగ్ర దర్శక,నిర్మాత అయిన కరణ్ జోహార్ యాంకర్ గా కాఫీ విత్ కరణ్ షో చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ షో బాలీవుడ్ లో ఇక ఫేమస్ అయ్యింది.

Published By: HashtagU Telugu Desk
Buzz Ram Charan Jr Ntr Reject Koffee With Karan 7

Buzz Ram Charan Jr Ntr Reject Koffee With Karan 7

బాలీవుడ్ అగ్ర దర్శక,నిర్మాత అయిన కరణ్ జోహార్ యాంకర్ గా కాఫీ విత్ కరణ్ షో చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ షో బాలీవుడ్ లో ఇక ఫేమస్ అయ్యింది. ఈ షో ఎంతలా ఫేమస్ అయ్యింది అంటే బాలీవుడ్ లో ఉండే ప్రతి ఒక్క స్టార్ సెలబ్రిటీ కూడా ఈ షోకి ఒక్కసారైనా వెళ్లాలి అని అనుకునే అంతలా. ఇప్పటికే ఈ షో పలు సీజన్ లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మూడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ కాఫీ విత్ కరణ్ షో ఎట్టకేలకు సీజన్ 7 మొదలుకానుంది.

కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ఈ షో జూలై 7న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. ఇకపోతే ఈ షో యొక్క మొదటి సీజన్ 2004లో మొదలైన విషయం. ఇక బాలీవుడ్ లో తెగ పాపులర్ ఈ షో కోసం అభిమానులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక రాబోయే సీజన్‌లో ఎవరెవరు పాల్గొనబోతున్నారు అన్న విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నారు. ఇకపోతే కొత్త సీజన్‌లో బాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాకుండా ఆర్ఆర్ఆర్ స్టార్స్‌తో సహా కొంతమంది ప్రముఖ సౌత్ సెలబ్రిటీలు కూడా ఉంటారని గతంలో నివేదించబడిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ షోకి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ రావడం లేదని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలో నిజానిజాలు తెలియాలి అంటే వేచిచుడాల్సిందే మరి. కాగా ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు కరీనా కపూర్, అలియా భట్, రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్, నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా పలువురు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో పాటుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా కనిపించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

  Last Updated: 01 Jul 2022, 08:43 PM IST