Site icon HashtagU Telugu

Prabhas Unstoppable: క్రేజీ అప్డేట్.. బాలయ్య షోకు ప్రభాస్, ఫ్యాన్స్ కు పూనకాలే!

Prabhas, unstoppable

Prabhas

నందమూరి నటసింహ బాలకృష్ణ తన ఎనర్జీ, పంచ్ డైలాగులు, ప్రాసలతో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) షోను ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తున్నాడు. వరుసగా స్టార్ సెలబ్రిటీలను కూడా షోకు రప్పిస్తూ ఎవరికీ తెలియని విషయాలను ప్రేక్షకులకు తెలియజేస్తున్నాడు. తాజాగా ఈ షోలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొంటారని ఆసక్తి వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్ (Prabhas) తన బెస్ట్ ఫ్రెండ్ మాకో స్టార్ గోపీచంద్‌తో కలిసి పాల్గొంటాడని టాక్. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరగనున్న ఈ ఎపిసోడ్ షూటింగ్‌లో ప్రభాస్, గోపీచంద్ పాల్గొన్నారని టాక్. ప్రభాస్, బాలకృష్ణలకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable)కి ప్రభాస్‌ను స్వాగతించే భారీ బ్యానర్‌లు కూడా ఇప్పటికే అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఈ షోలో బాలకృష్ణతో ప్రభాస్ ఎలాంటి సీక్రెట్‌లు పంచుకుంటాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం న్యూఇయర్ వేడుకలకు ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది.

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయిన ప్రభాస్ (Prabhas) చేతిలో ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇందులో ‘ఆదిపురుష్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. అలానే సలార్, ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో ప్రభాస్ (Prabhas) నటిస్తున్నాడు.

ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రభాస్‌కి జోడీగా ఈ సినిమాలో నిధి అగర్వాల్‌, మాళవికా మోహన్‌, రిద్ది కుమార్‌ రూపంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నెక్ట్స్ వీక్‌లో రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. థియేటర్‌లో జరిగే ఓ కీలకమైన సన్నివేశం కోసం థియేటర్ సెట్‌ని హైదరాబాద్ పరిసరాల్లోనే సిద్ధం చేస్తున్నారు.

Also Read: Telangana Congress: ప్రక్షాళనలో టీకాంగ్రెస్.. ఠాగూర్ ఔట్, రేవంత్ దూకుడుకు చెక్!

Exit mobile version