Adipurush Offer: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ!

సినిమాను ప్రమోట్ చేయడానికి, ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడానికి ఆదిపురుష్ టీం అనూహ్య నిర్ణయం తీసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Adipurush

Adipurush

బాలీవుడ్ (Bollywood) పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ విడుదలకు ముందే వార్తల్లో నిలిచింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ (Prabhas), కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, కొందరు నెటిజన్లు, రాజకీయ నాయకులు ఈ మూవీని వివాదాస్పదం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ టీం తెలివిగా వ్యవహరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం 100 రూపాయలతో సినిమాను చూసేలా అడుగులు వేయబోతోంది.

సినిమాను ప్రమోట్ చేయడానికి, ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడానికి ఆదిపురుష్ మేకర్స్ (Producers) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కేవలం రూ. 100 పెట్టి ఆదిపురుష్ టిక్కెట్‌ను కొనుగోలు చేయవచ్చని నిర్మాతలు ట్రైలర్‌ సందర్భంగా తెలియజేశారు. “టికెట్లు (Tickets) బుక్ చేయండి!! 1 ధరకు 2 టిక్కెట్లు పొందండి. ఈ ఆఫర్ హైదరాబాద్‌తో సహా భారతదేశం అంతటా చెల్లుబాటు అవుతుంది. ఈ క్రేజీ ఆఫర్ ప్రభాస్ అభిమానుల్లో సంతోషం నింపింది.

ఇంతకుముందు సినిమా టీజర్ విడుదలైన తర్వాత, చిత్ర నిర్మాతలు ‘VFX అస్సలు బాగాలేదని ట్రోల్ చేయబడ్డారు. ఈ పౌరాణిక చిత్రం విడుదల తేదీకి కూడా ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ చాలామందికి నచ్చింది. అయినప్పటికీ నెగిటివ్, పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆదిపురుష్ ఈ ఏడాది జూన్ 16న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇందులో రాఘవగా ప్రభాస్, జానకిగా కృతి, లంకేష్ పాత్రలో సైఫ్ నటిస్తున్నారు.

Also Read: Bike Taxi Vehicles: ఉబర్, ఓలా, ర్యాపిడో వాహనాలపై ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం

  Last Updated: 11 May 2023, 11:52 AM IST