మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ..అక్కినేని నాగార్జున (Nagarjuna), సమంత (Samantha)ల ఫై చేసిన కామెంట్స్ ఫై సినీ లోకమే కాదు యావత్ సినీ అభిమానులు, రాజకీయతర నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఓ మంత్రిగా బాధ్యత హోదాలో ఉండికూడా..సాటి మహిళా ఫై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తారా..? అంటూ సురేఖ ఫై ఆగ్రహపు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చిత్రసీమలో చిరంజీవి (CHiranjeevi) దగ్గరి నుండి ప్రతిఒక్కరు సురేఖ కామెంట్స్ ఫై నిప్పులు చెరుగుతూ ఇది మంచి పద్ధతి కాదంటూ హెచ్చరిస్తున్నారు. చిత్రసీమ అంటే అందరికి చిన్న చూపుగా మారిందని..ఇండస్ట్రీలో అంత ఒకోటిగా వుండకపోవడమే దీనికి కారణం అవుతుందని.మా వరకు రాలే కదా మాకెందుకు అన్నట్లు వ్యవహరిస్తున్నారు కాబట్టే ఈరోజు ప్రతి ఒక్కరు చిత్రసీమలో వ్యక్తులపై ఆస్తులపై దాడులు చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు.
ఈ క్రమంలో నిర్మాత బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు చేసారు. మనం గట్టిగా ప్రతిస్పందించక పోవడం.. మనం అవతలి వాళ్లకు సాఫ్ట్ టార్గెట్ అయ్యేలా చేస్తుందేమోనని ఒక్కసారి ఆలోచించాలని చిత్రసీమను కోరారు. ఇప్పటి నుంచి అయినా మన వాయిస్ గట్టిగా వినిపించాలన్నారు. “ఆవేశంలో మాట జారుతాం. అలాంటి సందర్భంలో కూడా మాట అదుపులో పెట్టుకోవడమే ఉత్తమ వ్యక్తుల అత్యుత్తమ లక్షణం. ఒక ఉన్నత పదవిలో ఉన్నప్పుడు,ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా స్ఫూర్తిదాయకంగా వ్యవహరించే తీరు మన పెద్దల నుంచి మనం నేర్చుకోవాలి. ఇన్ని నిందలు, ఇన్ని ఆరోపణలు సినీ కుటుంబంపై పడుతున్నా కూడా.. మనం గట్టిగా ప్రతిస్పందించక పోవడం..మనం అవతలి వాళ్లకు సాఫ్ట్ టార్గెట్ అయ్యేలా చేస్తుందేమో ఒకసారి ఆలోచించండి..
ఏమన్నా కూడా వీళ్ళు ఏమనరు అని మనమే వాళ్లకు విమర్శించే అవకాశం ఇస్తున్నామేమో అనిపిస్తుంది. కనీసం ఇప్పటినుంచి అయినా సినీ కుటుంబం తరఫు నుంచి గట్టిగా మన వాయిస్ వినిపించే సమయం వచ్చిందేమో అని నా అభిప్రాయం… మనకు కూడా కుటుంబాలున్నాయి.. మనం కూడా మనుషులమే..మన మనసులు బాధపడతాయి.” అని బన్నీవాస్ ట్వీట్ చేశారు.
ఆవేశంలో మాట జారుతాం. అలాంటి సందర్భంలో కూడా మాట అదుపులో పెట్టుకోవడమే ఉత్తమ వ్యక్తుల అత్యుత్తమ లక్షణం. ఒక ఉన్నత పదవిలో ఉన్నప్పుడు,ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా స్ఫూర్తిదాయకంగా వ్యవహరించే తీరు మన పెద్దల నుంచి మనం నేర్చుకోవాలి. ఇన్ని నిందలు, ఇన్ని ఆరోపణలు సినీ కుటుంబంపై పడుతున్నా కూడా..…
— Bunny Vas (@TheBunnyVas) October 3, 2024
Read Also : ANR Family : అక్కినేని ఫ్యామిలీ కే ఎందుకు ఇలా జరుగుతుంది..? ఏమైనా దోషాలున్నాయా..?