Site icon HashtagU Telugu

Thandel Piracy : తండేల్ పైరసీ పై అల్లు అరవింద్, బన్నీ వాసు ఫైర్.. పవన్ వద్దకు తీసుకెళతాం.. స్పందించిన ఆర్టీసీ చైర్మన్..

Bunny Vasu and Allu Aravind Fires on Thandel Piracy wants to Meet Pawan Kalyan

Thandel Pirasy

Thandel Piracy : ఇటీవల సినిమా పైరసీ మళ్ళీ బాగా పెరిగింది. ఒకప్పుడు పైరసీ భూతం సినీపరిశ్రమను వెంటాడింది. ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకోవడంతో సద్దుమణిగిన మళ్ళీ గత రెండు మూడు నెలలుగా పైరసి సినిమాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల పుష్ప, దేవర, గేమ్ చెంజర్ సినిమాలు పైరసి అయ్యాయి. గేమ్ ఛేంజర్ అయితే రిలీజ్ రోజే HD ప్రింట్ పైరసి చేసేసారు. లోకల్ ఛానల్ లో కూడా వేసేసారు. ఇప్పుడు తండేల్ సినిమా పైరసి అయింది.

తండేల్ సినిమా లీక్ అవ్వడమే కాకుండా ఓ ఆర్టీసీ బస్సులో కూడా టెలికాస్ట్ చేసారు. దీంతో మూవీ యూనిట్ సీరియస్ అయి నిన్న ఓ ప్రెస్ మీట్ పెట్టారు. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు తండేల్ సినిమా పైరసి గురించి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఫిల్మ్ ఛాంబర్ చర్యల వల్ల కొన్ని సంవత్సరాలుగా సినిమా పైరసీ జరగడం లేదు. కానీ మళ్ళీ రెండు నెలల నుంచి సినిమా ఫైరసీ రాక్షసి విరుచుకుపడుతుంది. గేమ్ ఛేంజర్ దారుణంగా పైరసీకి గురైంది. ఫిల్మ్ ఛాంబర్ లో సినిమా పైరసీ సెల్ ఏర్పాటు చేశాం. వాట్సప్ గ్రూపుల్లో పైరసీ లింకులను ఫార్వర్డ్ చేస్తున్నారు. వాట్సప్ గ్రూపు, టెలిగ్రామ్ అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలి. నిన్న గవర్నమెంట్ ఆర్టీసీ బస్సుల్లో తండేల్ ప్రింట్ ను ప్లే చేశారు. ఇకపై పైరసీ పై సీరియస్ చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. గీతా గోవిందం తర్వాత కఠిన చర్యలు తీసుకోవడం వల్ల పైరసీ తగ్గించగలిగాం. రెండు నెలల నుంచి మళ్లీ పైరసీ భయపెడుతుంది. సినిమా అనేది మా అందరి కష్టం. మా అందిరి బాధేంటంటే ఈ పైరసీ తెలిసి కొంత మంది చేస్తున్నారు. యువత సినిమా పైరసీ ఉచ్చులో చిక్కుకోవద్దు. తండేల్ పైరసీ చేసిన వ్యక్తులపై కేసు పెట్టాం. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో కూడా పైరసీ సినిమాని ప్లే చేసారు. తండేల్ పైరసీ సినిమాపై, పైరసీ నష్టాల గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను. కేబుల్ ఆపరేటర్ లను కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాను. మా సినిమా క్లిప్ ఒక్కటి ప్లే చేసినా కేబుల్ ఆపరేటర్లపై కేసు పెడతాం. తండేల్ సినిమా ఫైరసీ చేస్తే 9573225069 నెంబర్ కు మెసేజ్ చేయండి అని అన్నారు.

అయితే ఏపీఎస్ ఆర్టీసీలో సినిమా ప్లే చేయడం పై తండేల్ నిర్మాత ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుని ఉద్దేశించి ట్వీట్ చేసి ఆ పనిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు స్పందించి ఈ ఘటనపై విచారణ చేయాలని ఆదేశించారు.

 

Also Read : #BoycottLaila Trend : పృథ్వీరాజ్‌ ఎంతపనిచేసావ్..?