Site icon HashtagU Telugu

Bunny Vas : అల్లు యూనివర్సిటీ.. అల్లు అరవింద్ డీన్.. బన్నీ క్లోజ్ ఫ్రెండ్ స్పెషల్ ట్వీట్..

Bunny Vas Interesting Tweet on Allu Aravind regarding Thandel

Bunny Vas

Bunny Vas : టాలీవుడ్ లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్. ఇప్పుడు చాలా మంది నిర్మాతలు వచ్చినా గత జనరేషన్ నుంచి ఇప్పటికి నిలబడింది అల్లు అరవింద్ ఒక్కరే. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఇంకా సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు. అయితే తన బ్యానర్లోనే తనతో పనిచేసిన వాళ్ళని పలువురిని నిర్మాతలుగా మారుస్తూ వాళ్ళతో సినిమాలు తీయిస్తున్నారు. అలాంటి వారిలో బన్నీ వాసు ఒకరు.

మెగా ఫ్యాన్ గా అల్లు అర్జున్ దగ్గరకి వచ్చి అల్లు అర్జున్ కి అత్యంత ఆప్తుడిగా మారి తన ఇంటిపేరుని కూడా మార్చేసుకొని టాలీవుడ్ లో బన్నీ వాసు గా మారాడు. GA 2 పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి దానికి బన్నీ వాసుని నిర్మాతగా చేసారు అల్లు అరవింద్. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తండేల్. ఈ సినిమాని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. జనవరి 28న తండేల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా ఫైనల్ కాపీ అయిపోయినట్టు, దాన్ని అల్లు అరవింద్ చూసి ఫుల్ మార్క్స్ ఇచ్చినట్టు బన్నీ వాసు ఆసక్తికర ట్వీట్ వేశారు. బన్నీ వాసు తన ట్వీట్ లో.. తండేల్ సినిమాకి డిస్టింక్షన్ తో పాస్ అయ్యాం. అల్లు యూనివర్సిటీ డీన్ అల్లు అరవింద్ సర్టిఫికెట్ ఇచ్చారు అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అలాగే మరో ట్వీట్ లో లోపల అల్లు అరవింద్ సినిమా చూస్తుంటే బన్నీ వాసు బయట వెయిట్ చేస్తూ.. టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఎలా వెయిట్ చేస్తారో అల్లు అరవింద్ గారు లోపల ఫైనల్ సినిమా చూస్తుంటే నేను అలా వెయిట్ చేస్తున్నా అని రాసుకొచ్చాడు.

అయితే ప్రమోషన్స్ కోసమే ఇలా అల్లు యూనివర్సిటీ అంటూ రాసుకొచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై పలువురు నిజంగానే ఏదైనా ఫిలిం యూనివర్సిటీ అల్లు అరవింద్ స్థాపిస్తే బాగుండు ఏమో అని కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది పాస్ చేయాల్సింది అల్లు అరవింద్ కాదు ఆడియన్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాపై చైతు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.

 

Also Read : Kushi Kapoor : పెళ్లి పై జాన్వీ కపూర్ చెల్లి కామెంట్స్.. ఆమెకు కూడా అలాగే కావాలంట..