టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న గీతా ఆర్ట్స్ (Geetha Arts) పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అల్లు అరవింద్ (Allu Aravind) ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ గత నాలుగు దశాబ్దాలుగా భారీ విజయాలను సొంతం చేసుకుంది. కాగా ఆ సంస్థ బాధ్యతలను తన కుమారులలో ఎవరికైనా ఒకరికి అప్పగిస్తారని అంత అనుకుంటూ వచ్చారు. కానీ అరవింద్ మాత్రం బన్నీ వాసు (Bunny Vasu) అనే వ్యక్తిని నమ్మి, సంస్థ బాధ్యతలు ఆయన చేతిలో పెట్టారు. గత కొన్నేళ్లుగా వాసు గీతా ఆర్ట్స్‌కు కీలకంగా వ్యవహరిస్తున్నారు.
Nagarjuna : నాగ్..ఇంకా సైలెంట్ గా ఉంటే ఎలా..?
అరవింద్ పెద్ద కుమారుడు బాబీ కూడా నిర్మాణ విభాగంలో కొంతవరకు చూసుకున్న మొత్తం వ్యవహారాలను మాత్రం ముందుండి నడిపిస్తున్నది మాత్రం బన్నీ వాసునే. పెద్ద బడ్జెట్ చిత్రాలను అల్లు అరవింద్ నిర్మాతగా తీసుకుంటే, మీడియం, చిన్న సినిమాలను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తూ సక్సెస్ సాధిస్తూ వస్తున్నారు. కాగా ఇటీవల బన్నీ వాసు స్వంత బ్యానర్ ప్రారంభించనున్నాడనే వార్తలు బయటకు రావడంతో దీనిపై ఇంటర్వ్యూలో ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను వేరే బ్యానర్ పెట్టడం లేదు. గీతా ఆర్ట్స్‌ను విడిచిపెట్టడం లేదు. కానీ కొన్ని కథల విషయంలో నాకు, అరవింద్ గారికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. నాకు నచ్చిన కథ ఆయనకు నచ్చకపోవచ్చు. అలాగే ఆయనకు నచ్చిన కథ నాకూ నచ్చకపోవచ్చు’’ అంతే తప్ప మరోటికాదు అని వాసు స్పష్టతనిచ్చారు.
ఇలాంటి పరిస్థితుల్లో తనకు నచ్చిన కథలు గీతా ఆర్ట్స్‌లో కాకుండా జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌లోనే నిర్మించాలనుకుంటున్నట్లు వాసు వెల్లడించారు. ఈ విషయంలో అరవింద్ కూడా అంగీకరించారని క్లారిటీ ఇచ్చారు. ఈ క్లారిటీ తో బన్నీ వాసు గీతా ఆర్ట్స్‌లోనే కొనసాగుతారని, కానీ తన ఇష్టానుసారంగా కొన్ని చిత్రాలను నిర్మిస్తారని స్పష్టం అయింది.