పుష్ప (Pushpa)..ఈ పేరు గత ఐదేళ్లుగా దేశ వ్యాప్తంగా వైరల్ గా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రాష్ రష్మిక (Allu Arjun-Rashmika) జంటగా..లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ పుష్ప . ఈ మూవీ రెండు పార్ట్స్ గా తెరకెక్కింది. 2021 డిసెంబర్ 17 న (Pushpa 1) వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. ఇక ఇప్పుడు పార్ట్ 2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది. ఇప్పటికే బీహార్ , చెన్నై , కొచ్చి లలో భారీ ఈవెంట్స్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన మేకర్స్..ఈరోజు ముంబై లో భారీ ఈవెంట్ జరిపారు. ముంబైలోని jw marriott sahar హోటల్ లో గ్రాండ్ గా ఈవెంట్ చేయగా..ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ పుష్ప టైటిల్ కు సంబంధించి పలు విషయాలు షేర్ చేసాడు. ఈ మూవీ కి టైటిల్ గా ‘పుష్ప’ అనుకుంటున్నాం అన్నప్పుడు మరీ సాఫ్ట్ అయిపోతుందేమో అని హరీశ్ శంకర్ అన్నారు. ఇదే విషయాన్ని నేను సుకుమార్తో చెప్పాను. ‘టైటిల్ కు బ్యాగ్రౌండ్లో మీ రఫ్ లుక్ పెడదాం. రెండింటికీ మధ్య వైరుధ్యం వల్ల ఆసక్తి పెరుగుతుంది’ అని ఆయన అన్నారు. అదే నిజమైంది. ఈరోజు పుష్ప అంటే టైటిల్ కాదు ఓ బ్రాండ్ గా మారిందని పేర్కొన్నారు.
అలాగే పుష్ప-2లో తాను అమ్మవారి వేషంలో ఉన్న ఫొటోపై స్పందిస్తూ. పుష్ప-2 చిత్రం ఎంత పెద్ద హిట్ కాబోతోందో, ఈ సినిమా రేంజి ఏంటో చెప్పడానికి ఈ ఒక్క పోస్టర్ చాలని అన్నారు. ఇది పూర్తిగా దర్శకుడు సుకుమార్ ఐడియా అని వెల్లడించారు. తాను అమ్మవారి వేషం వేయడం వెనుక కథ ఉందని తెలిపారు. “నువ్వు ఈ సినిమాలో స్త్రీ వేషం వేయాలని సుకుమార్ చెప్పడంతో షాక్ కు గురయ్యాను. నేను లేడీ గెటప్ వేయడం ఏంటి… ఆర్యూ క్రేజీ! అంటూ సుకుమార్ కు రిప్లయ్ ఇచ్చాను. అయితే, దానికి ఓకే చెప్పాక… ఒకట్రెండు ఫొటో షూట్ లు జరిగాయి. మొదటి ఫొటో షూట్ ఫెయిలైంది, రెండో ఫొటో షూట్ ఫెయిలైంది… మూడో ఫొటో షూట్ తో అనుకున్న గెటప్ సాధించగలిగాం. సుకుమార్ ఏం రాబట్టాలనుకుంటున్నాడో అప్పుడు అర్థమైంది. సుకుమార్ నిజంగా జీనియస్ డైరెక్టర్. సినిమా కోసం మేమింత కష్టపడ్డాం, అంత కష్టపడ్డాం అని చెప్పుకోవడాన్ని నేను ఇష్టపడను. కానీ, నా 20 ఏళ్ల సినీ కెరీర్ లో అమ్మవారి వేషం వేయడానికి చాలా శ్రమించాను. ఎంత కష్టపడ్డానో మాటల్లో చెప్పలేను” అని బన్నీ చెప్పుకొచ్చారు.
Read Also : Mallikharjuna Kharge : ఐక్యత లేకపోవడం వల్లే ఓటమి.. CWC సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు