సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ (Allu Arjun Bail Petition)పై నాంపల్లి కోర్టు(Nampally court)లో విచారణ వాయిదా పడింది. బన్నీ తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశాడు. అయితే, ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి పోలీసులు సమయం కావాలని కోరగా, కోర్టు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా..కోర్ట్ బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. కానీ హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసి, విడుదల చేసింది.
అయితే నాంపల్లి కోర్టు ఇచ్చిన రెండు వారాల రిమాండ్ గడువు పూర్తి కావడంతో అల్లు అర్జున్ కోర్టులో వర్చువల్ గా హాజరయ్యారు. దీంతో పాటే ఆయన రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇదే కేసులో పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ ను వ్యతిరేకించారు. ఇవాళ అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలుకు సమయం కోరారు. దీంతో నాంపల్లి కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ పిటిషన్ పై ప్రభుత్వం ఏం చెబుతుందో చూడాలి.
Read Also : Steve Smith: భారత్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన స్మిత్