Site icon HashtagU Telugu

Laila : బుల్లిరాజు బుగ్గ కొరికేసిన ”లైలా”

Bullirajumeetsviswak

Bullirajumeetsviswak

సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు వచ్చినప్పటికీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాలు మాత్రం రెండే. అందులో ఒకటి ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam). వెంకటేష్ – అనిల్ రావిపూడి కలయికలో ఎఫ్ 2 , ఎఫ్ 3 తర్వాత వచ్చిన ఈ మూవీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు బుల్లిరాజు పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారు. తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచాడు. సినిమాలో బుల్లి రాజుగా ఆకట్టుకున్న బాలనటుడు రేవంత్ (Revanth) బుగ్గను లైలా కోరికేసింది.

యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన తాజా చిత్రం ‘లైలా’. మాస్ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన తొలిసారి ఇందులో లేడీ పాత్రలో నటించబోతున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా బుల్లిరాజు చేత ప్రమోషన్ చేయించి సినిమాకు మరింత బజ్ తీసుకొచ్చారు. ”కళ్ళు మూస్తేకొత్త పిల్లే గుర్తుకొస్తోంది. ఎలాగైనా లైలాని తీసుకొచ్చి మా నాన్నకి రెండో పిన్నిని చేయాల్సిందే” అంటూ నేరుగా సోనూ మోడల్ దగ్గరకే వెళ్లి లైలా గురించి వాకబు చేస్తాడు. ‘లైలాతో మీ నాన్న ఏం చేస్తాడు?’ అని విశ్వక్ అడుగుతాడు. ‘కొలికేస్తాడు కొలికేస్తాడు’ అంటూ తన శైలిలో చెప్పడంతో.. విశ్వక్ నిజంగానే తనను కొరికేసాడు అంటూ బుల్లిరాజు ఏడుస్తూ చెప్తున్న ఈ ఫన్నీ వీడియో ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ వీడియో పై లుక్ వెయ్యండి.