Kalki 2898 AD : ప్రభాస్ తో పాటు ఇండియాలోని సూపర్ స్టార్ కాస్ట్ తో తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడి’. వచ్చే నెలలో రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీలోని ఒక్కో పాత్రని మేకర్స్ పరిచయం చేసుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఈ మూవీలో ప్రభాస్ తో పాటు కనిపించే బుజ్జి అనే పాత్రని.. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు పరిచయం చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ చెప్పిన టైంకి రిలీజ్ చేయలేక.. నాలుగు గంటల ఆలస్యంగా తీసుకు వచ్చారు.
బుజ్జి అంటే ప్రభాస్ ఉపయోగించబోయే సూపర్ కారు. ఇక ఈ కారుకి బ్రెయిన్ కూడా ఉంటుంది. దాని పేరే బుజ్జి. ఇక ఈ బుజ్జి కోసం మహానటి ‘కీర్తి సురేష్’ తన గొంతుని అరువు ఇస్తుంది. బుజ్జి మాటలు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ తో వినబోతున్నారు. కాగా ఇంతసేపు ఎదురు చూసేలా చేసిన మేకర్స్.. ఆ కారుని కూడా పూర్తిగా చూపించకుండా నిరాశ పరిచారు. ఆ కారుని మే 22న ఆడియన్స్ కి చుపిస్తామంటూ తెలియజేసారు.
కాగా ఈ సినిమా రిలీజ్ కంటే ముందే.. ఈ సినిమా కథ ఆధారంగా ఓ యానిమేషన్ వెబ్ సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారట. ఈ వెబ్ సిరీస్ ముగింపు నుంచే సినిమా కథ మొదలవుతుందట. మొత్తం నాలుగు ఎపిసోడ్స్ తో ఈ వెబ్ సిరీస్ ని రూపొందించారట. ఒక్కో ఎపిసోడ్ 20 నిముషాలు పై నిడివితో ఉండబోతుందట. ఈ వెబ్ సిరీస్ ని నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేయనున్నారట. మే 25 తరువాత ఈ సిరీస్ ని నెట్‌ఫ్లిక్స్ ప్రసారం చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.