Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడి’. ఈ సినిమాలో స్టార్ యాక్టర్స్ తో పాటు రోబో గాడ్జెట్స్ కూడా ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. వీటిలో ప్రధానం బుజ్జి పాత్ర ఒకటి. ఈ పాత్రని ఇటీవలే పరిచయం చేస్తూ ఒక మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు. అయితే ఆ వీడియోలో బుజ్జి ఫుల్ లుక్ ని రివీల్ చేయలేదు. నేడు (మే 22) రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే ఈవెంట్ లో బుజ్జిని రివీల్ చేయబోతున్నారు.
కాగా ఈ డేట్ విషయంలో కల్కి మేకర్స్.. ప్రభాస్ కి సంబంధించిన ఒక విషయాన్ని ఫాలో అయ్యినట్లు తెలుస్తుంది. బుజ్జి అనే పేరు వినగానే టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ మూవీనే గుర్తుకు వస్తుంది. పూరీజగన్నాధ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో బుజ్జిగాడిగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలోని ప్రభాస్ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ తో ఫ్యాన్స్ ని బాగా అలరించారు. మూవీ కమర్షియల్ గా పెద్ద హిట్ కాకపోయినా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం బుజ్జిగాడు ప్రత్యేకమైన మూవీ.
ప్రభాస్ కి కూడా ఈ మూవీకి ప్రత్యేక స్థానం ఇస్తానని గతంలో చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా ఇదే రోజున 2008లో మే 22న రిలీజ్ అయ్యింది. ఇప్పుడే అదే రోజున కల్కి సినిమాలో మన బుజ్జిగాడితో ట్రావెల్ అయ్యే బుజ్జిని పరిచయం చేయబోతున్నారు. మరి మేకర్స్ ఈ డేట్ ని అనుకోని ఫిక్స్ చేసారా..? లేదా అనుకోకుండా ఇలా జరిగిందా..? అనేది తెలియదు గాని.. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.
మరి మన బుజ్జిగాడితో ట్రావెల్ అయ్యే ఆ బుజ్జి ఎలా ఉండబోతుందో తెలియాలంటే.. సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ బుజ్జికి మహానటి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.