Site icon HashtagU Telugu

Natural Star Nani : నాని సినిమాకు బడ్జెట్ సమస్యలా.. 100 కోట్లు కొట్టినా నమ్మట్లేదా..?

Nani Shocking Comments on Eega 2

Nani Shocking Comments on Eega 2

Natural Star Nani న్యాచురల్ స్టార్ నాని 100 కోట్లతో బాక్సాఫీస్ ని షేక్ చేసినా సరే అతనికి ఇంకా నిర్మాతలు నమ్మట్లేదా ఏంటి.. దసరాతో నాని తనకు తానుగా సెల్ఫ్ మేడ్ స్టార్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. కొత్త దర్శకులతో నిర్మాతలను సేఫ్ గా ఉంచుతూ సక్సెస్ మేనియా కొనసాగిస్తున్నాడు.

అలాంటి నాని సినిమాకు బడ్జెట్ ని పెట్టేందుకు నిర్మాతలు వెనుకాడుతున్నారట. అదేంటి అసలు ఏ సినిమాకు అలా జరుగుతుంది అంటే. నాని సుజిత్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ తోనే ఆడియన్స్ సర్ ప్రైజ్ అయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్న సుజిత్ తన నెక్స్ట్ సినిమా నానితో చేయాలని అనుకున్నాడు. అయితే నానితో ఆల్రెడీ సరిపోదా శనివారం సినిమా చేస్తున్న డివివి దానయ్య ఈ సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. సుజిత్ ఓజీ పూర్తి చేశాక వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుందని అనుకున్నారు.

Also Read : Renu Desai : సోషల్ మీడియా వేదికగా రూ.3500 సాయం అడిగిన రేణుదేశాయ్

కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ వచ్చి చేరింది. నాని సినిమాకు సుజిత్ ఒక బడ్జెట్ వేసి ఇవ్వగా నానికి అంత బడ్జెట్ పెట్టడం పై నిర్మాతలు ఆలోచిస్తున్నారట. నాని కెరీర్ లో దసరా 100 కోట్లు సినిమా పడినా ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది కానీ మళ్లీ 100 కోట్లు రాబట్టలేదు. అయితే సినిమా బడ్జెట్ రిలీజ్ ని బట్టే వసూళ్లు ఉంటాయి.

సుజిత్ డైరెక్షన్ లో నాని సినిమాకు భారీ బడ్జెట్ అవుతుందని మేకర్స్ డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం ప్రాజెక్ట్ ని కొనసాగించాలా లేదా ఆపేయాలా అన్న చర్చలు జరుగుతున్నాయి. నాని 31 పై ఈ కన్ ఫ్యూజన్ కొన్నాళ్లు మాత్రమే ఉంటుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ న్యూస్ వస్తుందని చెప్పొచ్చు.