RC16 : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ని పూర్తి చేసుకున్నారు. ఇక RC16 పట్టాలు ఎక్కించడమే ఆలస్యం. ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రం కోసం స్టార్ కాస్ట్ ని ఎంచుకుంటున్నారు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంపిక చేసుకోగా ఓ ముఖ్య పాత్ర కోసం కన్నడ మెగాస్టార్ శివ రాజ్ కుమార్ సెలెక్ట్ చేస్తున్నారు. ఇక టెక్నీషియన్స్ గా కెమెరా మెన్ రత్నవేలు, మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ని తీసుకున్నారు.
రీసెంట్ గా రత్నవేలు సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో రెహమాన్, బుచ్చిబాబుతో కలిసి పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోని బుచ్చిబాబు షేర్ చేయగా, రత్నవేలు దానిని రీట్వీట్ చేస్తూ.. ‘గొప్ప సినిమా తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ ట్వీట్ చేసారు. కాగా ఈ మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బుచ్చిబాబు, రెహమాన్ తోనే ఎక్కువ ట్రావెల్ అవుతూ వస్తున్నారు. ఇది చూస్తుంటే బుచ్చిబాబు మ్యూజిక్ పై బాగా ఫోకస్ పెట్టినట్లు ఉన్నారు. ఉప్పెన సినిమా విషయంలో కూడా బుచ్చిబాబు.. దేవిశ్రీ ప్రసాద్ తో ఇలానే ట్రావెల్ అయ్యి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ని ఇచ్చారు.
Love you @BuchiBabuSana Let’s create an epic ❤️ https://t.co/m1pcy1sUXb
— Rathnavelu ISC (@RathnaveluDop) July 14, 2024
సినిమా విజయంలో ఆ మ్యూజిక్ ఎంత ప్లస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు రెహమాన్ నుంచి కూడా అదే ఇన్‌పుట్ ని బుచ్చిబాబు రాబట్టబోతున్నారా..? అనే సందేహం కలుగుతుంది. అయితే ఇటీవల రెహమాన్ ఇచ్చి మ్యూజిక్ లో వింటేజ్ రెహమాన్ ని మిస్ అవుతున్నారు. బుచ్చిబాబు ప్రయత్నం చూస్తుంటే.. RC16తో వింటేజ్ రెహమాన్ ని పరిచయం చేసేలా కనిపిస్తున్నారు. కాగా ఈ మూవీలోని రెండు సాంగ్స్ ని గతంలోనే పూర్తి చేసేసినట్లు రెహమాన్ పూజా కార్యక్రమం రోజున చెప్పుకొచ్చారు.