Site icon HashtagU Telugu

RC16 : బేబమ్మని వదలని బుచ్చి బాబు..!

Bucchi Babu Repeats His Beb

Bucchi Babu Repeats His Beb

RC 16 బుచ్చి బాబు డైరెక్షన్ లో ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బేబమ్మ అలియాస్ కృతి శెట్టి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అమ్మడికి వరుస ఛాన్స్ లు వచ్చాయి. వరుసగా 3 సినిమాలు హిట్ తో స్టార్ లీగ్ లోకి వెళ్లింది కృతి శెట్టి. అయితే ఆ తర్వాత అమ్మడిని వరుస ఫ్లాపులు పలుకరించాయి. కెరీర్ లో టఫ్ సిచువేషన్ లో ఉన్న బేబమ్మకి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం శర్వానంద్ శ్రీరాం ఆదిత్య కాంబో సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కృతి శెట్టి మరోపక్క మలయాళ లో టోవినో థామస్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది.

జయం రవి తమిళంలో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లో కూడా కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఇదిలాఉంటే లేటెస్ట్ గా అమ్మడికి మరో భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. బుచ్చి బాబు తన సెకండ్ మూవీ మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. RC 16వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలో కృతి శెట్టిని కూడా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్.

సినిమాలో మెయిన్ హీరోయింగ్ ఆ కృతి నటిస్తుందా లేదా సెకండ్ హీరోయిన్ గా చేస్తుందా అన్నది తెలియదు కానీ బేబమ్మ మాత్రం చరణ్ సినిమాలో ఉంటుందని అంటున్నారు. బుచ్చి బాబు తన సెంటిమెంట్ ని కొనసాగించేలా కృతి శెట్టిని తన సెకండ్ సినిమాలో కూడా రిపీట్ చేస్తున్నాడు. మరి అమ్మడు నిజంగానే చరణ్ 16వ సినిమాలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.

రాం చరణ్ (Ram Charan) ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. బుచ్చి బాబు సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ రేంజ్ లో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు.

Also Read : OTT: ఓటీటీలోకి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే