బుల్లితెర సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సుమ కనకాల (Suma Kanakala)..ఇప్పుడు ఆమె కుమారుడ్ని చిత్రసీమలోకి ఎంట్రీ ఇప్పించింది. రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా పరిచయం అవుతున్నారు. ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీల’ సినిమాల దర్శకుడు రవికాంత్ పేరేపు (Ravikanth) దర్శకత్వంలో రోషన్ కనకాల ‘బబుల్‌గమ్’ (Bubblegum )మూవీ తో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రీసెంట్ గా విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకోగా..మంగళవారం చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసి ఆసక్తి రేపారు. ప్రస్తుతం యూత్ కు కావాల్సిన లిప్‍లాక్‍లు, కొన్ని బోల్డ్ డైలాగ్‍లతో టీజర్ ను నింపేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రేమ అనేది బబుల్‍గమ్ లాంటిదని, ముందు తియ్యగా ఉన్నా ఆ తర్వాత అంటుకుంటుందంటూ వాయిస్ ఓవర్‌తో బబుల్‍గమ్ మూవీ టీజర్ స్టార్ట్ అయ్యింది. ఓ మటన్ షాప్‍లో హీరో ఆదిత్య ( రోషన్ కనకాల) పని చేస్తూ మరోపక్క పార్ట్ టైం పబ్‍లో డీజే అపరేటర్‌గా పనిచేస్తుంటాడు. ఓ రోజు జాన్వీ (మానస చౌదరీ) పబ్‍లో చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతారు. ఆ తర్వాత రోషన్ గురించి నిజం తెలిసి హీరోయిన్ గొడవ పడుతుంది. ఇక సముద్రం ఒడ్డున హీరోహీరోయిన్ లిక్‍లాక్‍తో బబుల్‍గమ్ సినిమా టీజర్ ముగిసింది. ఇలా హాట్ రొమాంటిక్ సీన్ల తో టీజర్ ను కట్ చేసారు. మరి సినిమాలో ఇంకెత హాట్ సన్నివేశాలు ఉంటాయో..? సినిమా కథ ఏంటో..? అనేది చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ ఈ మూవీ ని నిర్మిస్తుంది. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. రవికాంత్ పేరేపు గత చిత్రాలు ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీల’కు కూడా శ్రీచరణ్ పాకాలే సంగీతం అందించారు. ఇక సురేష్ రగుతు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Read Also : Shubman Gill: ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్, పాక్, బంగ్లాదేశ్ మ్యాచులకూ డౌటే