Director Puri : డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఫై పోలీసులకు ఫిర్యాదు

బిఆర్ఎస్ నేతలు రజితారెడ్డి, సతీష్ కుమార్ ఎల్బీనగర్ డీసీపీకి పిర్యాదు ఇచ్చారు

Published By: HashtagU Telugu Desk
Brs Complaint On Director P

Brs Complaint On Director P

‘డబుల్ ఇస్మార్ట్’లోని ‘మార్ ముంతా చోడ్ చింతా’ సాంగ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. రామ్ – పూరి కలయికలో 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామ్ సరసన కావ్య థాప‌ర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ విల‌న్ గా న‌టిస్తున్నాడు. పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ పై ఛార్మితో క‌లిసి పూరి జ‌గ‌న్నాధ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మూవీ ఫై అంచనాలు తారాస్థాయిలో ఉండడంతో..పూరి ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు. ఈ మధ్యనే ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకున్న మేకర్స్..ఇప్పుడు రెండో సింగిల్ ‘మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముంత చోడ్ చింత’ (Maar Muntha Chod ) అంటూ సాగే సాంగ్ ను రెండు రోజుల క్రితం మేకర్స్ విడుదల చేసారు. ఈ సాంగ్ ఆలా విడుదల అయ్యిందో లేదో..సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీనికి కారణం మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఫెమస్ డైలాగ్ ‘ఏం చేద్దాం అంటవ్ మరి’ (Yem Cheddam Antav Mari) ఉండడమే. గతంలో కేసీఆర్ ఓ ప్రెస్‍మీట్‍లో అన్న ఈ మాట ఆ తర్వాత సోషల్ మీడియా లో పాపులర్ అయిన విషయం తెలిసిందే. దీన్ని ఫేమస్ మీమ్‌గా నెటిజన్లు వాడుతుంటారు. ఇప్పుడు పూరి తన సాంగ్ మధ్య లో ఆ డైలాగ్ పెట్టి ప్రేక్షకులకు కిక్ ఇచ్చాడు. ఇక ఈ సాంగ్ ను రాహుల్ సిప్లిగంజ్, కీర్తన శర్మ ఆలపించగా..మణిశర్మ మ్యూజిక్ అందించారు. అయితే ఈ సాంగ్ లో కేసీఆర్ డైలాగ్ పెట్టడం ఫై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ డైలాగ్ ను సాంగ్ లో నుండి తీసేయాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయగా..ఇక ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు.

బిఆర్ఎస్ నేతలు రజితారెడ్డి, సతీష్ కుమార్ ఎల్బీనగర్ డీసీపీకి పిర్యాదు ఇచ్చారు. ఐటెం సాంగ్లో బీఆర్ఎస్ అధ్యక్షుడి డైలాగ్ ‘ఏం చేద్దాం అంటావ్ మరి’ని ఎలా వాడుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ డైలాగ్ సాంగ్ లో పెట్టి తమ మనోభావాలను దెబ్బతీశాయని ఫిర్యాదులో పేర్కొంటూ..వెంటనే ఆ సాంగ్ లో నుండి ఆ డైలాగ్ ను తీసేయాలని కోరారు.

Read Also : Kavya Thapar : కావ్య టాప్ గేర్ వేసింది.. ఇస్మార్ట్ అందాల జాతర..!

  Last Updated: 18 Jul 2024, 06:27 PM IST