Site icon HashtagU Telugu

Bro Pre Release: బ్రో ప్రిరిలీజ్.. అందరి కళ్లు బండ్ల గణేశ్ పైనే!

Bandla

Bandla

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే వెంటనే టక్కున గుర్తుకువచ్చే పేరు బండ్ల గణేశ్. ఏదైనా ఆడియో ఫంక్షన్ జరిగితే అందరి కళ్లు బండ్ల గణేష్ మీదనే పడుతాయి. ఈశ్వరా పవనేశ్వరా అంటూ ఓ రేంజ్ లో పవర్ స్టార్ ని పొగుడుతూ స్పీచులతోనే ఫాలోయింగ్ సంపాదించుకోవడం బండ్ల గణేష్ కే చెల్లింది. ఒకదశలో ఈ విపరీత ప్రసంగాల వల్లే త్రివిక్రమ్ తనను దూరం పెట్టారనే ప్రచారం జరగడం, దానికి తగ్గట్టే గణేష్ కొన్ని ఇన్ డైరెక్ట్ ట్వీట్లు పెట్టడం కొన్ని నెలల క్రితం జరిగింది. ఈ కార్యక్రమానికి బండ్ల గణేష్ రావడం దాదాపు కన్ఫర్మ్ అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒకవేళ బండ్ల గణేష్ హాజరైతే మాత్రం బ్రో గురించి మాత్రమే కాక పవన్ రాజకీయ పరమైన అంశాల గురించి ప్రస్తావించే అవకాశాలున్నాయి. కొందరి వల్ల తన దేవుడికి దూరమయ్యానని కూడా బహిరంగంగానే సీరియస్ కూడా కావచ్చు. అయితే ఒకవేళ బండ్ల గణేశ్ వస్తే, త్రివిక్రమ్ శ్రీనివాస్ రాకపోవచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయి.  అయితే ‘బ్రో’ ప్రీ రిలీజ్ వేడుకను ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది.

‘బ్రో’ ప్రీ రిలీజ్ వేడుకను ఆలస్యంగా మొదలు పెట్టమని చిత్ర బృందానికి సిటీ పోలీసులు కూడా సూచించినట్లు తెలిసింది. ”ప్రజల సౌకర్యం, ట్రాన్స్‌పోర్ట్, భారీ వర్షాల కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని పవర్ ప్యాక్డ్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ సెలబ్రేషన్స్ రాత్రి 8.30 గంటలకు స్టార్ట్ చేస్తున్నాం.” అని ‘బ్రో’ నిర్మాణ సంస్థ మీడియాకు విడుదల చేసిన నోట్ లో పేర్కొంది.

Exit mobile version