Site icon HashtagU Telugu

BRO : ‘బ్రో’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉందంటే..

Bro Pre release Business Details

Bro Pre release Business Details

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ “బ్రో” (BRO). త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదలైన సాంగ్స్ , టీజర్ అంచనాలు రెట్టింపు చేయగా.. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా ఫై మరింత ఆసక్తి పెంచింది.

ఇక బ్రో ప్రీ రిలీజ్ బిజినెస్ (Bro Pre release Business Details) వివరాలు చూస్తే..మామూలుగానే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా కు భారీ డిమాండ్ ఉంటుంది. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతుంది. ప్లాప్ టాక్ వచ్చినాసరే నిర్మాతలు , డిస్ట్రబ్యూటర్స్ ఇలా ఎవ్వరు కూడా పెద్దగా నష్టపోరు. ఇక అదే హిట్ టాక్ వస్తే వారి ఖజానా నిండినట్లే. అందుకే చిన్న నిర్మాతల దగ్గరి నుండి పెద్ద నిర్మాతల వరకు పవన్ కళ్యాణ్ తో ఒక్క సినేమైనా చేయాలనీ కోరుకుంటారు. ఆ ఛాన్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు దక్కించుకున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది.

నైజాం ఏరియాలో 30 కోట్ల ధర పలుకగా.. సీడెడ్ లో 13.20 కోట్లు, ఉత్తరాంధ్రలో 19.5 కోట్లు, ఈస్ట్ లో 6.40 కోట్లు, గుంటూరులో 7.40 కోట్లు, కృష్ణ లో 5.24 కోట్లు, నెల్లూరులో 3.40 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రో సినిమా 80 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కర్ణాటక & రెస్ట్ ఆఫ్ ఇండియా 5 కోట్లు , ఓవర్సీస్ 12 కోట్ల బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా బ్రో రూ. 97.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తుంది. మరి ఫస్ట్ డే కలెక్షన్లు ఏ రేంజ్ లో వస్తాయో చూడాలి. ఎందుకంటే మాములుగా పెద్ద హీరోల సినిమాలకు టికెట్ ధరలు పెంచడం , అదనపు షోస్ వేయడం చేస్తుంటారు. కానీ బ్రో విషయంలో మాత్రం సాధారణ టికెట్ ధరలే అందుబాటులో ఉంచారు. అలాగే ఎలాంటి అదనపు షోస్ వేయడం లేదు.

Read Also: Pawan Kalyan: కోలీవుడ్ పెద్దలకు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్.. కారణమిదే!