బ్రో (BRO) యూనిట్ మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ (Kanaka Durga Temple)ను దర్శించుకున్నారు. హీరో సాయిధరమ్ తేజ్ తో పాటు డైరెక్టర్ సముద్రఖని (Samuthirakani) అమ్మవారి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ బ్రో. జులై 28 న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ చిత్ర సక్సెస్ టూర్ ను మొదలుపెట్టారు.
అందులో భాగంగా నేడు విజయవాడ లోని పలు థియేటర్స్ లలో సందడి చేయబోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను చిత్ర యూనిట్ దర్శించుకున్నారు. చిత్ర యూనిట్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. దేవాలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని లడ్డు ప్రసాదాన్ని చిత్ర యూనిట్ కు అందజేశారు. బ్రో సక్సెస్ టూర్ (BRO Movie Success Tour) లో భాగంగా ఈరోజు విజయవాడ, గుంటూరు, తెనాలి నగరాలలో మూవీ టీం సందడి చేయనున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే కేతికశర్మ, ప్రియా ప్రకాష్ లు హీరోయిన్లు గా నటించగా , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) స్క్రీన్ ప్లే , మాటలు అందించారు. భారీ అంచనాల మధ్య జులై 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అద్భుతం గా చేసాడని , సినిమాలో కామెడీ , ఎమోషన్ బాగా వర్క్ అయ్యాయని , థమన్ మ్యూజిక్ అదరగొట్టాడని ఇలా అంత పాజిటివ్ గా చెప్పుకొచ్చారు. కలెక్షన్ల విషయానికి వస్తే..ఫస్ట్ డే రూ. 30.05 కోట్లు నెట్ కలెక్షన్స్ రాగా.. రెండో రోజు రూ. 17.05 కోట్లు, మూడోవ రోజు రూ. 16.9 కోట్లు, ఇక నాల్గో రోజు (సోమవారం ) కేవలం రూ. 7 కోట్లు మాత్రమే వచ్చి షాక్ ఇచ్చింది. ఓవరాల్ గా బ్రో సినిమాకు 4 రోజుల్లో రూ. 71 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు సమాచారం.
Read Also: Varun Tej & Lavanya: ఇటలీలో వరుణ్, లావణ్య పెళ్లి, హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షెన్