మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #BRO వచ్చేసింది. వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ హిట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన #BRO భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మొదటి షో మొదలవ్వగా…ఓవర్సీస్ లో అర్ధరాత్రి నుండే షోస్ మొదలుకావడం తో అభిమానులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్రో (#BRO) చిత్రానికి సముద్రఖని డైరెక్ట్ చేయగా..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందించారు.
తమిళంలో భారీ విజయం సాధించిన వినోదయ సీతమ్ (Vinodhaya Sitham) సినిమా రీమేక్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier), కృతిక శర్మ (Ketika Sharma) హీరోయిన్లు నటించారు. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు.
ఇక సినిమా టాక్ (BRO Talk) విషయానికి వస్తే..ప్రతి ఒక్కరు కూడా పవర్ స్టార్ సింగిల్ హ్యాండెడ్ పెర్ఫార్మెన్స్ అని చెపుతున్నారు. అభిమానులు ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఉన్నాయని చెపుతున్నారు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో పవర్ స్వాగ్ అభిమానులకు ఫుల్ మీల్స్ అంటున్నారు. ఫ్యాన్స్‌కు మంచి అనుభూతి కలిగించే సన్నివేశాలు ఉన్నాయి బ్రో అని చెపుతున్నారు.
ఎక్కువగా పవన్ మేనరిజం మీదే దృష్టిపెట్టారని , పవన్ (Pawan Kalyan) పాత సినిమాల్లో గెటప్‌లు, పాటలను సందర్భానుసారంగా తీసుకురావడం అభిమానులను ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు. ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. కాకపోతే సెకండాఫ్ లో కాస్త కొన్ని ల్యాగ్ సీన్లు, బోరింగ్ సీన్లు ఉన్నాయి. స్క్రీన్‌ప్లే చాలా వీక్‌గా రాసుకున్నారని విమర్శిస్తున్నారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అరిపించాడని , సాంగ్స్ ఓకే అన్నట్లు అంటున్నారు. హీరోయిన్స్ పర్వాలేదని , సముద్రఖని డైరెక్షన్ బాగుందని చెపుతున్నారు. ఓవరాల్ గా పవన్ BRO ను ఓసారి చూడొచ్చు అని చెపుతున్నారు.
Read Also : Telangana Rains: ఎట్టి పరిస్థితుల్లో ప్రాణనష్టం జరగొద్దు, మంత్రులకు సీఎం ఆదేశాలు