పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రో’(BRO). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తుండగా.. త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందించారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నఈ మూవీ ఈ నెల 28 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు సినిమాపై అంచనాలు పెంచేయగా..మరికాసేపట్లో హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక మొదలుకాబోతుంది. వాస్తవానికి సాయంత్రం 6 గంటలకే ఫంక్షన్ మొదలుకావాల్సి ఉండగా… హైదరాబాద్ (Hyderabad) లో వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా పోలీస్ శాఖ వారి సూచనల మేరకు ప్రీరిలీజ్ వేడుక కొంత ఆలస్యంగా ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ వేడుక రాత్రి 8.30 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించింది. అయితే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరుకాకపోవచ్చనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరి పవన్ లేకుండా ప్రీ రిలీజ్ అనేది అభిమానులు తట్టుకోలేరు. నిజంగా పవన్ రావడం లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో వర్షం (Rain) మొదలైంది. నిన్న కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతమైంది. ఇప్పుడు మరోసారి దట్టమైన మబ్బులతో వర్షం మొదలైంది. ఈ వర్షం ఎంత సేపు ఉంటుందో..అని నగరవాసులు భయపడుతున్నారు. త్వరగా ఇంటికి వెళ్లాలనే అతృతతో అంత ఉన్నారు.
Read Also: Rain Alert : వామ్మో…హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వాన..