Site icon HashtagU Telugu

Bro Collections : అదరగొడుతున్న ‘బ్రో’ కలెక్షన్స్.. పవన్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా 100 కోట్లు..

Bro Movie Collects 100 Crores in just three days Pawan Kalyan Creates Records

Bro Movie Collects 100 Crores in just three days Pawan Kalyan Creates Records

పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కలిసి నటించిన సినిమా బ్రో(Bro Movie). పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో సినిమా భారీ అంచనాలతో జులై 28న రిలీజయి థియేటర్స్ లో అదరగొడుతుంది. ఒక మంచి ఎమోషనల్ స్టోరీకి కమర్షియల్ ఎలిమింట్స్, ఫ్యాన్స్ కి కావాల్సిన స్పెషల్ ఎలిమెంట్స్ జత చేసి బ్రో సినిమాని రిలీజ్ చేశారు. దీంతో బ్రో సినిమా ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తుంది.

అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే కలెక్షన్స్ మంచిగా మొదలయి సినిమా రిలీజ్ రోజు హిట్ టాక్ రావడంతో థియేటర్స్ కి జనాలు పోటెత్తి బ్రో సినిమాకు కలెక్షన్స్ భారీగా ఇచ్చారు. బ్రో సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 48 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ గా నిలిచింది. ఇక రెండో రోజు 27 కోట్లు కలెక్ట్ చేసి ఏకంగా రెండు రోజుల్లో బ్రో సినిమా 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మూడో రోజు నిన్న ఆదివారం 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మూడు రోజుల్లో 101 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది బ్రో సినిమా.

దీంతో బ్రో సినిమా పవన్ కెరీర్ లోనే అత్యంత వేగంగా 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బ్రో సినిమా కూడా 100 కోట్లు కలెక్ట్ చేయడంతో పవన్ కెరీర్ లో మొత్తం ఆరు సినిమాలు 100 కోట్ల క్లబ్ లోకి చేరాయి. ఇక ఈ వారం పెద్ద సినిమాలేమి లేకపోవడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

 

Also Read : Dil Raju : తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు.. మొదటి రోజే మీటింగ్..