మంత్రి అంబటి రాంబాబు చెప్పిన చెప్పకపోయినా ..బ్రో (BRO) మూవీ వల్ల మాత్రం నిర్మాత విశ్వప్రసాద్ ఎంతోకొంత నష్టపోవడం మాత్రం పక్క. ఇది మీము చెప్పే మాట కాదు..బ్రో మూవీ వారం రోజుల్లో కలెక్ట్ చేసిన లెక్క చెపుతుంది. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో సముద్రఖని డైరెక్షన్లో త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందించిన చిత్రం బ్రో. గత నెల 28 న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ , కలెక్షన్లు మాత్రం పెద్దగా రాబట్టలేకపోతుంది. మొదటి మూడు రోజులు పర్వాలేదు అనిపించినా , తర్వాత నుండి భారీగా పడిపోతూ వచ్చాయి.
ఓవరాల్ గా వారం రోజుల్లో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో (TS-AP) రూ. 50.71 కోట్లు రాబట్టగా .. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.80 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే వారం రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 63.21 కోట్లు షేర్, రూ. 105.80 కోట్లు గ్రాస్ రాబట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలతో చూస్తే ఈ మూవీ ఇంకా కనీసం రూ.34 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే అంత రాబట్టడం కష్టమే అని తెలుస్తుంది. ఈ వారం ఏ పెద్ద సినిమా రిలీజ్ కానప్పటికీ బ్రో సినిమాను చూసేందుకు పెద్దగా జనాలు ఇంట్రస్ట్ చూపించడం లేదు. బ్రో కంటే బేబీ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వస్తుండడం విశేషం. బేబీ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు నెల దగ్గరికి వస్తున్న ఇంకా..థియేటర్స్ లలో సందడి చేస్తూనే ఉంది.
బ్రో మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (BRO First Week Collections) ఏరియా వైజ్ గా చూస్తే..
నైజాంలో రూ. 19.76 కోట్లు
సీడెడ్‌లో రూ. 6.47 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 6.55 కోట్లు
ఈస్ట్ గోదావరిలో రూ. 4.61 కోట్లు
వెస్ట్ గోదావరిలో రూ. 4.20 కోట్లు
గుంటూరులో రూ. 4.33 కోట్లు
కృష్ణాలో రూ. 3.18 కోట్లు
నెల్లూరులో రూ. 1.61 కోట్లతో కలిపి.. రూ. 50.71 కోట్లు షేర్, రూ. 79.75 కోట్లు గ్రాస్ వచ్చింది.
Read Also : AP: ‘ప్రేమ వాలంటీర్’ గా మారిన జబర్దస్త్ నటుడు..హెచ్చరిస్తున్న వైసీపీ నేతలు