Site icon HashtagU Telugu

Bro..Bhola : మెగా బ్రదర్స్ ను నమ్మకుంటే రూ. 80 కోట్లు లాస్..?

Bro-bholashankar movies makes huge loss to producers

Bro-bholashankar movies makes huge loss to producers

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బాక్స్ ఆఫీస్ (Box Office) వద్ద వీరి స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను నెలకొల్పిన స్టార్స్ వీరు. వీరి తో ఒక్క సినిమానైనా చేయాలనీ డైరెక్టర్స్ , నిర్మాతలు , నటి నటులు కోరుకుంటుంటారు. అంతే కాదు వీరితో సినిమాలు చేస్తే భారీ లాభాలు వస్తాయని నిర్మాతల నమ్మకం. కానీ ఇదంతా ఒకప్పటి లెక్క. ఇప్పుడు ఆలా కాదు..ప్రేక్షకుల అభిరుచి మారింది. సినిమా బాగుంది అంటేనే థియేటర్స్ కు వెళ్లి చూస్తున్నారు తప్ప..అందులో చిరంజీవి హీరో , పవన్ కళ్యాణ్ హీరో అనేది చూడడం లేదు. తాజాగా వీరి నుండి వచ్చిన చిత్రాలు భారీ నష్టాలను మిగిల్చి నిర్మాతలను కోలుకోలేని దెబ్బ తీశాయి. బయటకు నిర్మాతలు మాకేం లాస్ లేదని చెపుతున్నప్పటికీ , అధికార లెక్కలు మాత్రం భారీ నష్టాలనే మిగిల్చాయని తేల్చి చెపుతున్నాయి. అభిమానులను దృష్టిలో పెట్టుకొని చిరు , పవన్ లకు డైరెక్టర్స్ కథలు రాస్తున్నప్పటికీ..చివరకు ఆ అభిమానులే సినిమా బాగాలేదని సినిమాను చూడడం మానేస్తున్నారు.

ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా భారీ కాస్ట్ & క్రూ లేకుండా విడుదలైన భారీ విజయాలు అందుకున్న చిత్రాలు బేబీ (Baby Movie) , సామజవరగమన (samajavaragamana). ఈ రెండు చిత్రాలు అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి..భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ రెండు చిత్రాల్లో కథే హీరో..ఆ కథే ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్స్ కు వచ్చేలా చేసాయి. ఇక ఇలాంటి ట్రెండ్ నడుస్తున్న తరుణంలో పెద్దగా కథలోని పవన్ కళ్యాణ్ బ్రో, చిరంజీవి భోళా శంకర్ సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్లాప్ జాబితాలో చేరాయి.

చిరంజీవి మెహర్ రమేష్ కాంబోలో వచ్చిన భోళా శంకర్ (Bhola Shankar) సినిమాకు మొదటి రోజు మొదటి ఆటతోనే ఎలాంటి టాక్ వచ్చిందో తెలియంది కాదు. డైరెక్టర్ కనిపిస్తే కొడతాం అంటూ అభిమానులు పబ్లిక్ గా హెచ్చరికలు జారీ చేసారు. దీనిని బట్టే అర్ధం చేసుకోవాలి సినిమా ఎలా తెరకెక్కించాడో. ఈ టాక్ మూలంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు లేకుండా పోయాయి. మొదటి రెండు మూడు రోజుల్లోనే కోట్లలో వచ్చిన షేర్.. ఆ తరువాత లక్షలకు వేలకు పడిపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఏకంగా 50 కోట్లకు పైగా నష్టాలను తెచ్చి పెట్టేలా ఉందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఈ మూవీని 79 కోట్లకు అమ్మితే.. 80 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిందట. ఇప్పటి వరకు కనీసం ముప్పై కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయిందని సమాచారం.

ఇక పవన్ – సాయి తేజ్ కలయికలో వచ్చిన బ్రో (BRO) మూవీ కూడా అంతే..పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ , ప్రేక్షకులు సినిమాను చూసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేకపోయారు. బ్రో సినిమాకు ఈ 19 రోజుల్లో 97 కోట్ల బిజినెస్ చేస్తే.. ఇప్పటి వరకు 67 కోట్ల షేర్ వచ్చిందట. ఇంకా ముప్పై కోట్లు రాబడితే గానీ బ్రేక్ ఈవెన్ అవ్వదని సమాచారం. అది అవుతుందనే నమ్మకం కూడా లేదు. ఓవరాల్ గా భోళా శంకర్ , బ్రో సినిమాల వల్ల నిర్మాతలకు దాదాపు రూ.80 కోట్ల లాస్ వచ్చిందని ట్రెండ్ వర్గాలు చెపుతున్నాయి. ఇకనైనా హీరోలను దృష్టిలో పెట్టుకొని కథలు రాయడం మానేసి..ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో..ఇలాంటి కొత్తదనం కోరుకుంటున్నారో అలాంటి కథలు పెట్టి సినిమాలు చేస్తే నిర్మాతలకు నాల్గు పైసలు వస్తాయి..చూసే ఆడియన్స్ కు కాస్త కాలక్షేపం అవుతుంది. మరి ఇకనైనా దర్శకులు ఆలా కథలు రాస్తే బాగుంటుంది.

Read Also : Vangaveeti Radha Marriage : పెళ్లి పీటలెక్కబోతున్న వంగవీటి రాధా..వధువు ఆమెనేనట..