Site icon HashtagU Telugu

BRO ఇక కష్టమేనా..?

Bro netflix streaming soon

Bro netflix streaming soon

పవన్ కళ్యాణ్ నటించిన BRO మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోతుంది. రోజు రోజుకు ఈ చిత్ర వసూళ్లు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఓ పక్క చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ చేస్తున్న..మంత్రి అంబటి రాంబాబు వాటి వారు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నప్పటికీ ఎందుకు మైలేజ్ రావడం లేదు. నిర్మాతకు ఓ పది లక్షల వరకు నష్టం రావడం పక్క అని అభిప్రాయపడుతున్నారు.

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ (Pawan-Sai Tej) లు నటించిన మూవీ బ్రో. సముద్రఖని డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫై విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీ జులై 28 న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్లు (Collections) మాత్రం పెద్దగా రావడం లేదు. మొదటి మూడు రోజులు గట్టిగానే వచ్చినప్పటికీ ఆ తర్వాత నుండి కలెక్షన్లు బాగా డ్రాప్ అవుతూ వస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో నాల్గోవ రోజు బ్రో కేవలం రూ. 2 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. ఇక ఐదొవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 1.60 నుండి 1.70 కోట్లు రాబట్టింది. ఆరొవ రోజు దారుణంగా రూ. 1.20 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే రూ.1.45 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. మొత్తంగా ఆరు రోజులకు వరల్డ్ వైడ్ రూ. 62 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ లెక్క బట్టి చూస్తే ఇంకో రూ.38 కోట్లు వస్తే కానీ సినిమా గట్టెక్కాదు. కానీ ప్రస్తుత వసూళ్లు చూస్తే అంత రావడం కష్టమే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరో వారం వరకు పెద్ద సినిమా లేదు. కాబట్టి బ్రో మరో రూ. 20 కోట్లకు పైగా రాబట్టొచ్చు అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ప్రొడ్యూసర్ కు మాత్రం రూ. 10 లక్షల వరకు నష్టపోతారని చెపుతున్నారు.

ప్రొడ్యూసర్స్ సినిమా టికెట్ ధరలు పెంచి ఉంటె..ఈపాటికి లాభాల్లో ఉండేవారు. కానీ సాధారణ టికెట్ ధరలే పెట్టడం..అదనపు షోస్ వేయకపోవడం వల్ల కలెక్షన్లు తగ్గాయని చెపుతున్నారు.

Read Also :  Athulya Ravi : చూపులతో కవ్విస్తోన్న వయ్యారి భామ అతుల్య రవి