Google Search: గూగుల్‌లో సత్తా చాటిన సౌత్ సినిమాలు.. టాప్ 10లో మనవి ఎన్నంటే..?

  • Written By:
  • Publish Date - December 8, 2022 / 09:40 AM IST

గూగుల్ (Google) ఇండియా బుధవారం నాడు సెర్చ్ 2022 ఫలితాల్లో అత్యధికంగా శోధించబడిన ప్రశ్నలు, సంఘటనలు, వ్యక్తిత్వాలు, మరిన్నింటిని వెల్లడించింది. రణబీర్ కపూర్-ఆలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర గూగుల్ (Google)లో అత్యధికంగా శోధించబడిన చిత్రం. ఈ ఏడాదికి గాను అత్యధికంగా గూగుల్‌లో వెతికిన చిత్రంగా బ్రహ్మస్త్ర టాప్ లో నిలిచింది. కాగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2022’ని తాజాగా ఆవిష్కరించింది.

ఈ ఏడాది ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్న జాబితాను తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో కేజీఎఫ్-2, మూడో స్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, నాలుగో స్థానంలో ఆర్ఆర్ఆర్, ఐదో స్థానంలో కాంతార నిలిచాయి. ఆ తరువాత వరుసగా పుష్ప-ది రైజ్, విక్రమ్, లాల్ సింగ్ చద్ధా, దృశ్యం-2, థోర్-లవ్ అండ్ థండర్‌ సినిమాలు ఉన్నాయి.

Also Read: KGF actor Krishnaji Rao: కన్నడ పరిశ్రమలో విషాదం.. KGF నటుడు మృతి

మొదటి పది స్థానాల్లో దక్షిణాదికి చెందిన ఐదు చిత్రాలు ఉండగా.. కేవలం నాలుగు హిందీ చిత్రాలు మాత్రమే చోటు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. గత కొంతకాలంగా ఫిల్మ్ ఇండస్ట్రిలో దక్షిణాది సినిమాల హవా కొనసాగుతున్న తరుణంలో ఈ మూవీ వాటిని వెనక్కినెట్టి ముందు వరుసలో నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దక్షిణాదిలో ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్, కాంతార , కార్తికేయ 2 వంటి చిత్రాలు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. గతేడాది సూర్య నటించిన జై భీమ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.