టాలీవుడ్(Tollywood) స్టార్ కమెడియన్ బ్రహ్మానందం(Brahmanandam) దశాబ్దాల కాలం నుంచి ఆడియన్స్ ని నవ్విస్తూనే వస్తున్నాడు. చిరంజీవి(Chiranjeevi) ‘చంటబ్బాయి’ సినిమాతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన బ్రహ్మానందం.. రాజేంద్రప్రసాద్ ‘అహ నా పెళ్ళంట’ సినిమాతో ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో ‘అరగుండు’ పాత్రతో తనకి లైఫ్ ఇచ్చిన జంధ్యాల దర్శకత్వంలో బ్రహ్మానందం ఎన్నో సినిమాలు చేశాడు. 1988లో రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) హీరోగా జంధ్యాల(Jandhyala) తెరకెక్కించిన ‘వివాహభోజనంబు’ సినిమాలో కూడా బ్రహ్మానందం నటించి నవ్వులు పూయించాడు.
అహ నా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం మధ్య స్పెషల్ కామెడీ ట్రాక్ రాసిన జంధ్యాల.. వివాహభోజనంబు చిత్రంలో వీరభద్రరావు, బ్రహ్మి మధ్య అలాంటి స్పెషల్ ట్రాక్ నే రాశారు. ఆ మూవీలో విశాఖపట్నం బీచ్ లోని ఒక కామెడీ సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ లో వీరభద్రరావు, బ్రహ్మానందాన్ని పీకలదాకా ఇసుకలో పాతేసి.. హైదరాబాదు, సికిందరాబాదు, ఆదిలాబాదు అంటూ మొత్తం 21 బాదుల పేర్లు చెప్పి బాదేస్తుంటాడు. వీరభద్రరావు చెప్పే బాదుడి పురాణానికి బ్రహ్మానందం ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ఆడియన్స్ ని విపరీతంగా నవ్వించాయి.
కాగా ఇలా భూమిలో పాతిపెట్టాల్సి వస్తే.. నటులను ఒక చెక్కపెట్టెలో పెట్టి చుట్టూ ఇసుకతో కప్పి పెడతారు. కానీ బ్రహ్మానందాన్ని మాత్రం చెక్క పెట్టి లేకుండానే నిజంగానే ఇసుకలో పాతపెట్టారంట. చేతులు కాళ్ళు ఏమి కదిలించలేక, ఒక్క మొహంతోనే నటించడానికి బ్రహ్మానందం చాలా కష్ట పడ్డాడట. ఆ సీన్ లో బ్రహ్మి ఒక డైలాగ్ చెబుతాడు. ‘ఏ ఊరకుక్కయినా దగ్గరకొచ్చి కాలెత్తితే పావనమైపోతుంది మహాప్రభో’ అనే డైలాగ్ ని.. షూటింగ్ సమయంలో నిజంగా కుక్క రావడంతో అప్పటికప్పుడు రాశారట.
ఇక సీన్ ఒకే అయిన తరువాత బ్రహ్మానందాన్ని ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారట. దీంతో బ్రహ్మి.. ‘మహానుభావా నన్ను ఈ గోతులోంచి ఏమైనా తీసేది ఉందా’ అంటూ గట్టిగా కేకల పెట్టాడంట. అది విని చిత్ర యూనిట్ వచ్చి తనని బయటకి తీశారని బ్రహ్మానందం ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు.
Also Read : Leo Collections : లియో సినిమా కలెక్షన్స్ ఫేక్? థియేటర్స్ ఓనర్స్ ఆగ్రహం.. స్పందించిన డైరెక్టర్..
