Site icon HashtagU Telugu

Brahmanandam Son Marriage : బ్రహ్మానందం రెండో తనయుడి వివాహం.. బ్రహ్మానందం కోడలు ఎవరు? ఏం చేస్తుందో తెలుసా?

Brahmanandam Second Son Sidhhartha Marriage with Aishwarya

Brahmanandam Second Son Sidhhartha Marriage with Aishwarya

దాదాపు వెయ్యికి పైగా సినిమాలతో మనల్నందర్నీ నవ్వించిన గొప్ప నటుడు బ్రహ్మానందం(Brahmanandam). ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమారుడు గౌతమ్(Goutham) సినిమాల్లో నటిస్తున్నాడు. రెండో తనయుడు సిద్ధార్థ(Siddhartha) విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం రెండో తనయుడి నిశ్చితార్థం జరిగింది.

తాజాగా బ్రహ్మానందం రెండో తనయుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం ఆగస్టు 18 రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు గల అన్వయ కన్వెన్షన్స్ లో జరిగింది. పెళ్లికూతురు పేరు ఐశ్వర్య(Aishwarya). హైదరాబాద్ లోని ప్రముఖ గైనకాలజిస్ట్ పద్మజ వినయ్ కూతురు ఐశ్వర్యని సిద్ధార్థ వివాహం చేసుకున్నారు. ఐశ్వర్య కూడా డాక్టర్ చదివి ప్రస్తుతం ఓ హాస్పిటల్ లో పనిచేస్తుంది. బ్రహ్మానందం రెండో కోడలిగా డాక్టర్ అమ్మాయిని తెచ్చుకున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.

సిద్దార్థ – ఐశ్వర్య వివాహ మహోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు వచ్చి నూతన దంపతులని ఆశీర్వదించారు. ఇక సినీ పరిశ్రమ నుంచి కూడా బాలకృష్ణ, మోహన్ బాబు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాజశేఖర్ జీవిత దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులు, చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దమ్మాయి సుష్మిత, శ్రీకాంత్ ఫ్యామిలీ, సాయి కుమార్ ఫ్యామిలీ, మంచు విష్ణు దంపతులు, మంచు మనోజ్ దంపతులు, దర్శకులు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, నటులు రావు రమేష్, ఆలీ ఫ్యామిలీ, ఎల్బీ శ్రీరామ్, రఘు బాబు, పలువురు నిర్మాతలు.. ఇలా అనేకమంది హాజరయ్యారు. బ్రహ్మానందం రెండో తనయుడి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Also Read : Varun Tej: సోషల్ మీడియాలో నా వ్యక్తిగత విషయాలేవీ పంచుకోను: వరుణ్ తేజ్