Brahmanandam Nepali Movie : హాస్య బ్రహ్మ హ్రశ్వ ధీర్ఘ.. తెలుగు నేపాలి రిలీజ్.. ఖాతాలో మరో రికార్డ్..!

Brahmanandam Nepali Movie నవ్వుల రారాజు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, సెలబ్రిటీస్ అంతా బ్రహ్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Published By: HashtagU Telugu Desk
Brahmanandam Nepali Movie Hraswa Dheergha Poster Released

Brahmanandam Nepali Movie Hraswa Dheergha Poster Released

Brahmanandam Nepali Movie నవ్వుల రారాజు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, సెలబ్రిటీస్ అంతా బ్రహ్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. లేటెస్ట్ గా బ్రహ్మానందం నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు.

We’re now on WhatsApp : Click to Join

కెరీర్ లో ఫస్ట్ టైం తెలుగు నేపాలి సినిమాలో నటిస్తున్నారు బ్రహ్మానందం. ఈ సినిమాకు హ్రశ్వ ధీర్ఘ టైటిల్ లాక్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ని బ్రహ్మానందం పుట్టినరోజుగా రిలీజ్ చేశారు.

హరిహర అధికరి, నెతా దుంగన లీడ్ రోల్స్ లో వస్తున్న ఈ హ్రశ్వ ధీర్ఘ సినిమాలో బ్రహ్మానందం, ప్రదీప్ రావత్ నటిస్తున్నారు. ఈ సినిమాను చంద్ర పంత్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ ప్లాన్ చేశారు. నేపాలి భాషలో బ్రహ్మానందం నటించడం ఇదే మొదటిసారి. తప్పకుండా అక్కడ కూడా బ్రహ్మానందం కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది.

టైటిల్ పోస్టర్ చూస్తే తెలుగు సినిమాలానే ఉన్నా హ్రశ్వ ధీర్ఘ సినిమా నేపాలిలో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. బ్రహ్మానందం పుట్టినరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమాతో బ్రహ్మానందం సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్నారని అనౌన్స్ చేశారు. ఇక బ్రహ్మానందం రీసెంట్ గా తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన కీడా కోలా సినిమాలో నటించారు. ఈ సినిమా లో ఆయన వీల్ చెయిర్ కే పరిమితమైనా కామెడీ బాగానే పండించారు.

Also Read : Sekhar Kammula Leader 2 : లీడర్ 2 చేస్తున్న శేఖర్ కమ్ముల.. హీరో విషయంలో క్లారిటీ లేదు..!

  Last Updated: 01 Feb 2024, 01:27 PM IST