Site icon HashtagU Telugu

Brahmanandam : బ్రహ్మానందం రెండో తనయుడి వివాహం.. కేసీఆర్‌కు ప్రత్యేక పిలుపు..

Brahmanandam Invited CM KCR for his second son Siddharth Marriage

Brahmanandam Invited CM KCR for his second son Siddharth Marriage

ఎన్నో సంవత్సరాలుగా కొన్ని వందల సినిమాలతో తెలుగు ప్రేక్షకులని నవ్విస్తున్న బ్రహ్మానందం(Brahmanandam) ఇటీవల కాలంలో మాత్రం సినిమాలకు(Movies) దూరంగా ఉంటూ ఎప్పుడో ఒకటి సినిమాలు చేస్తున్నారు. ఎక్కువ టైం తన కుటుంబానికే ఇస్తున్నారు బ్రహ్మానందం. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు గౌతమ్(Goutham) సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న కొడుకు సిద్దార్థ్(Siddharth) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.

ఇటీవల బ్రహ్మానందం రెండో తనయుడు సిద్దార్థ్‌కి హైదరాబాద్ లోని ప్రముఖ డాక్టర్ పద్మజ వినయ్ కుమార్తె డాక్టర్ ఐశ్వర్యతో నిశ్చితార్థం అయింది. త్వరలో వీరి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో జరుగనున్న తన కుమారుని వివాహానికి హాజరు కావాల్సిందిగా నేడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ని కలిసి ఆహ్వానించారు.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ ని కుటుంబ సమేతంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందచేశారు బ్రహ్మానందం. ఆయనతో పాటు అయన సతీమణి, పెద్ద కొడుకు గౌతమ్ కూడా వెళ్లారు. బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపి పెళ్ళికి వస్తామని కిచెప్పినట్టు సమాచారం. అలాగే సీఎం కేసీఆర్ దంపతులకు బ్రహ్మానందం తాను వేసిన వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహుకరించారు.

 

Also Read : Chiru Cut-out: భోళా శంకర్ సందడి షురూ.. చిరు భారీ కటౌట్ వైరల్ !