Site icon HashtagU Telugu

Brahmanandam : కింగ్ మూవీలో బ్రహ్మానందం మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాత్ర వెనకున్న కథ..

Brahmanandam Character in King Movie Designing Background story

Brahmanandam Character in King Movie Designing Background story

టాలీవుడ్(Tollywood) స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల(Srinu Vaitla), బ్రహ్మానందం(Brahmanandam) కాంబినేషన్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. బ్రహ్మానందంతో శ్రీనువైట్ల రాసిన కామెడీ సీన్స్ తోనే సినిమా హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత సూపర్ హిట్ కాంబినేషన్ వారిద్దరిది. కాగా నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘కింగ్'(King) మూవీ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం మ్యూజిక్‌ డైరెక్టర్‌ జై సూర్య పాత్రలో నటించాడు. ట్యూన్స్ ని కాపీ కొట్టి సంగీత దర్శకుడిగా నెట్టుకొచ్చే పాత్రలో బ్రహ్మానందం అందర్నీ నవ్వించాడు.

ఈ పాత్రని ఇప్పటి సంగీత దర్శకులోని కొందరిని పోలుస్తూ ట్రోల్స్ కూడా చేస్తుంటారు నెటిజెన్స్. అయితే అసలు ఈ పాత్ర ఆలోచన శ్రీనువైట్లకి ఎలా వచ్చిందో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ పాత్రని చూసిన చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని వెక్కిరిస్తూ పెట్టారని అనుకున్నారట. కానీ దానిలో నిజం లేదని శ్రీనువైట్ల వెల్లడించారు. చక్రి చాలామంచి వ్యక్తి అని, ఒక సినిమా ఇబ్బందుల్లో ఉండి ఆయన దగ్గరికి వెళ్తే డబ్బులు తీసుకోకుండా వారికి పని చేసేవారని శ్రీను వైట్ల తెలియజేశారు. తన ‘ఢీ’ సినిమాకి కూడా చక్రినే సంగీతం అందించారు.

అసలు జై సూర్య పాత్ర పుట్టడానికి వేరే సంగీతం దర్శకుడు కారణమని తెలియజేశారు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న లిరిక్ రైటర్ రామజోగయ్యశాస్త్రిని తీసుకోని ఒక సంగీత దర్శకుడు దగ్గరకు వెళ్లారట. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి రామజోగయ్యశాస్త్రిని పరిచయం చేసి పాటలు బాగా రాస్తారని చెప్పారట. ఇక శ్రీనువైట్ల చెప్పిన మాటలు తరువాత, ఆ సంగీత దర్శకుడు.. “అరె శాస్త్రి అది రాయి” అని ఒక పాట అడిగారట. ఆ మాటలకి శ్రీనువైట్ల షాక్ అయ్యారట. అసలు పరిచయం లేని వ్యక్తిని సడన్ గా అలా ‘అరె’ అని అనడం శ్రీనువైట్లకి కొత్తగా అనిపించింది.

దీంతో ఆ ఒక్క మాటను మాత్రం రియల్ లైఫ్ లో నుంచి తీసుకున్నారట. మిగితా అంతా కల్పితమే. ఆ పాత్రని డెవలప్ చేయడం కోసం రాంగోపాల్‌వర్మ తెరకెక్కించిన ఒక సినిమాలోని పాత్రను స్ఫూర్తిగా తీసుకున్నారట. అలా కింగ్ మూవీలోని జై సూర్య పాత్ర పుట్టింది.

 

Also Read : Vinayaka Chavithi : మెగాస్టార్ చిరంజీవి ఇంట వినాయకచవితి సంబరాలు అంబరాన్ని తాకాయి