Brahmanandam Birthday : హాస్య బ్రహ్మ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

  • Written By:
  • Publish Date - February 1, 2024 / 10:24 AM IST

హాస్య బ్రహ్మ ‘బ్రహ్మానందం ‘ (Brahmanandam ) కు 67 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. నవ్వడం ఒక భోగం..నవ్వించడం ఒక యోగం..నవ్వలేకపోవడం ఒక రోగం అని ప్రముఖ దర్శకుడు జంధ్యాల అన్నారు. కానీ వీటన్నింటికన్నా అద్భుతమైనది మరొకటి ఉంది అదే నవ్వించగలగడం. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. చాలా కొద్ది మందికే ఇది సాధ్యమవుతుంది. అలాంటి కొద్దీ మందిలో మొదటివాడు బ్రహ్మానందం. మాములుగా ఎవరైనా కామెడీ చేస్తే నవ్వొస్తుంది..కానీ బ్రహ్మానందాన్ని చూస్తే నవ్వుస్తుంది. అది ఆయన ప్రత్యేకత.

తెలుగు సినిమాల్లో చాలా పాత రోజుల నుంచీ కూడా హాస్య నటులకు కొదవేం లేదు. రేలంగి , పద్మనాభం, అల్లు రామలింగయ్యల్లాంటి వాళ్లు ఎందరో చిరకాలం గుర్తుండిపోయే హాస్యాన్ని మనకు అందించారు. కానీ తెలుగు వాడు ఎప్పటికీ గొప్పగా చెప్పుకునేది మాత్రం ఒక్క బ్రహ్మానందం గురించే. సినిమాలు చేయడం మానేసినా…అప్పుడప్పుడు మాత్రమే తెరపై కనిపించిన ప్రతి నిత్యం బ్రహ్మానందం మదిలో కనిపిస్తేనే ఉంటారు.

We’re now on WhatsApp. Click to Join.

బ్రహ్మానందం అసలు పేరు కన్నెగంటి బ్రహ్మానందం. ఫిబ్రవరి 1, 1956లో గుంటూరు జిల్లా, ముప్పాళ్లలో జన్మించారు. తండ్రి నాగలింగాచారి, తల్లి లక్ష్మీనరసమ్మ. బ్రహ్మానందం తండ్రి రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు ఉండేది. తండ్రితో పాటు ఆయన కూడా అప్పుడప్పుడు నాటకాలు వేసేవారు. కానీ, చదువును నిర్లక్ష్యం చేయకుండా.. చదువుకుని లెక్చర్ ఉద్యోగాన్ని పొందారు. నటన పట్ల తనకు ఎప్పుడూ ఆసక్తి తగ్గిపోలేదు. వేజళ్ల సత్యనారాయణ తెరకెక్కించిన ‘శ్రీతాతావతారం’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఇందులో నరేష్ హీరోగా నటించగా, ఆయనకున్న నలుగురు మిత్రుల్లో బ్రహ్మానందం ఒకరుగా చేశారు. తొలుత నటించింది ‘శ్రీతాతావతారం’ అయినా, ముందుగా విడుదలైన సినిమా ‘ఆహా నా పెళ్లంట’. ఈ సినిమాలో అరగుండు పాత్రలో నటించి అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి నుండి ప్రతి సినిమాలో కనిపిస్తూ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచేశారు. తనకు ఇచ్చిన ఏ క్యారెక్టర్ అయినా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు బ్రహ్మానందం. ఆయన నటించడం వల్లే మంచి విజయాలు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం కలకగమానదు. బ్రహ్మ నందం కోసం చాలామంది సినిమాలు చూసేవారు. 1,200కు పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు. అంతే కాదు ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు. ‘అహ నా పెళ్లంట’ సినిమాలో నటనకు గాను తొలి నంది అవార్డును అందుకున్న బ్రహ్మి.. ఆరు నంది అవార్డ్స్ , ఒక ఫిల్మ్ ఫేర్, 3 సైమా అవార్డులను అందుకున్నారు.

ప్రస్తుతం బ్రహ్మానందం సినిమాలు చేయడం లేదు. దాదాపు 5,6 ఏళ్ళ నుంచీ ఆయన కనిపించడం లేదు. అయినప్పటికీ మీమ్స్ ద్వారా సూపర్ పాపులర్ అయ్యారు. ఇది కూడా ఒక రికార్డే. ఇప్పటి వరకు ఏ కమెడియన్‌కూ దక్కని గౌరవం ఇది. ఏ ఎమోషన్ కు అయినా బ్రహ్మానందం స్టిల్ ఒకటి వాడుకుంటారు నెటిజన్లు. సోషల్ మీడియాలో బ్రహ్మి మీమ్స్ వాడని వారు ఉండరు. సోష‌ల్‌మీడియాలో ఒక ఎమోజీలా మారిపోయారు బ్రహ్మానందం. అలాంటి బ్రహ్మి కి ‘Hashtagu ‘ టీం ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతుంది.

Read Also : Arbaaz Khan: ఆ మూవీతో ఏడేళ్ల తర్వాత తెలుగులోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సల్మాన్ ఖాన్ తమ్ముడు?