Site icon HashtagU Telugu

Brahmanandam : CSK Vs SRH మ్యాచ్‌లో మనవడితో బ్రహ్మి సందడి.. గచ్చిబౌలి దివాకర్ అంటూ మీమ్స్ వైరల్..

Brahmanandam and His Grand Son Photos goes Viral from CSK Vs SRH IPL Match

Brahmanandam and His Grand Son Photos goes Viral from CSK Vs SRH IPL Match

IPL లో భాగంగా నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో CSK Vs SRH మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో SRH విజయం సాధించింది. అయితే హైదరాబాద్ లో మ్యాచ్ జరగడంతో అనేక రంగాల ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాం సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

ఇక టాలీవుడ్ నుంచి వెంకటేష్, హీరో ఆది, బ్రహ్మానందం, రాజా గౌతమ్, సుప్రీత, రీతూ చౌదరి.. ఇలా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బ్రహ్మానందం తన తనయుడు రాజా గౌతమ్, తన మనవడితో కలిసి వచ్చారు. దీంతో స్టేడియంలో బ్రహ్మానందం(Brahmanandam) ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక స్టేడియంలో మనవడిని బ్రహ్మానందం ఎత్తుకున్న ఫోటో రాజా గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసారు. దీంతో ఈ తాత మనవళ్ల ఫోటో వైరల్ అయింది.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో బ్రహ్మానందం గచ్చిబౌలి దివాకర్ అనే క్రికెట్ పిచ్చి ఉన్న పాత్రలో కనిపిస్తాడు. ఆ పాత్ర బాగా ఫేమస్ అయింది. దీంతో మీమర్స్ గచ్చిబౌలి దివాకర్ ఉప్పల్ స్టేడియంలో దగ్గరుండి SRH మ్యాచ్ గెలిపించాడు అని సరదాగా మీమ్స్ వేసి వైరల్ చేస్తున్నారు. అలాగే మ్యాచ్ ప్రమోషన్స్ లో భాగంగా బ్రహ్మానందం హైదరాబాద్ టీంకి సపోర్ట్ గా మాట్లాడగా ఆ వీడియోని కూడా రిలీజ్ చేసారు SRH టీం.

 

Also Read : Jr NTR : యువ హీరోలని ఎంకరేజ్ చేస్తున్న ఎన్టీఆర్.. మొన్న విశ్వక్.. నేడు సిద్ధూ కోసం..