Site icon HashtagU Telugu

బ్రహ్మాజీ కూడా శ్రీలీలనే కోరుకుంటున్నాడు

Brahmaji Comments On Sreele

Brahmaji Comments On Sreele

టాలీవుడ్ అంత శ్రీలీల (Sreeleela) మాయలో పడింది. చిన్న హీరో దగ్గరి నుండి పెద్ద హీరోల వరకు అంత ఆమెనే కావాలని కోరుకుంటున్నారు. తాజాగా సీనియర్ హీరో బ్రహ్మాజీ సైతం తన పక్కన శ్రీలీల అయితే బాగుంటుందని అన్నారు.

పెళ్లి సందD మూవీ తో తెలుగు నాట అడుగుపెట్టిన ఈ భామ..మొదటి సినిమాతోనే తన గ్లామర్ తో , డాన్స్ లతో కట్టిపడేసింది. ఆ తర్వాత ధమాకా సినిమా ఆమెను ఏకంగా స్టార్ హీరోయిన్ ను చేసేసింది. ధమాకా లో ఆమె డాన్స్ లు యూత్ కు కిక్ ఇచ్చాయి. ప్రస్తుతం ఒకటి , రెండు కాదు అమ్మడి చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. అవి కూడా మామలు హీరోలు కాదు పవర్ స్టార్ , సూపర్ స్టార్ వంటి అగ్ర హీరోల సినిమాలు. ఇవన్నీ విడుదలైతే అమ్మడి ని అందుకోవడం ఎవరి వల్ల కాదు. అమ్మడి డిమాండ్ , పాపులర్ చూసి ప్రతి ఒక్కరు శ్రీలీల నే కావాలని కోరుకుంటున్నారు.

తాజాగా సీనియర్ హీరో బ్రహ్మాజీ (Brahmaji ) కూడా అలాగే అన్నారు. బ్రహ్మజీ తనయుడు సంజయ్ రావు నటించిన రెండో సినిమా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో బ్రహ్మజీ ప్రమోషన్ కార్యక్రమంలో బిజీ అయ్యారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో “మళ్లీ మీకు హీరోగా చేసే ఛాన్స్ వస్తే, హీరోయిన్ గా మీ పక్కన ఎవరు చేయాలనుకుంటారు?” అని సదరు యాంకర్ బ్రహ్మాజీ ని ప్రశ్నించగా.. అందుకు ఆయన స్పందిస్తూ .. “శ్రీలీల అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. తను డాన్స్ చాలా బాగా చేస్తుంది .. నాకు రాదనీ అనుకుంటున్నారేమో .. నేను కూడా బాగానే చేస్తాను” అన్నాడు.

“శ్రీలీల చాలా ఫాస్టుగా స్టార్ డమ్ ను అందుకుంది. ఆమె ఎనర్జీ లెవెల్స్ చూస్తుంటే, జయప్రద – శ్రీదేవి రేంజ్ కి వెళుతుందని మొన్నీమధ్య ఒక పెద్ద ప్రొడ్యూసర్ నాతో అన్నారు. మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27వ తేదీన జరగనుంది. ఈవెంటుకి శ్రీలీల వస్తుంది .. ఆమెతో కలిసి అప్పుడు డాన్స్ చేస్తాను .. చూద్దురుగానీ” అంటూ తెలిపారు.

Read Also: Hyper Aadi : హైపర్ ఆది కిడ్నాప్..

Exit mobile version