Site icon HashtagU Telugu

Nag Ashwin : కల్కి డైరెక్టర్ చెప్పులకు బ్రహ్మజీ ముద్దు

Nag Cleep

Nag Cleep

నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. సినీ లవర్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరు నాగ్ అశ్విన్ గురించి ఆరా తీస్తున్నారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ (Yevade Subramanyam) సినిమాతో దర్శకుడిగా పరిచమైన ఈయన.. ఆ తర్వాత సావిత్రి గారి జీవిత కథతో ‘మహానటి’ (Mahanati) అనే సినిమాని తెరకెక్కించాడు. ఆ సినిమా ఎలాంటి అంచనాలు , పబ్లి సిటీ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సావిత్రి జీవితం మొత్తం కళ్ళముందే జరుగుతున్నట్టు.. సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత బయోపిక్..లకు డిమాండ్ పెరిగింది. కానీ ‘మహానటి’ స్థాయిలో ఏ బయోపిక్కు విజయాన్ని సాధించింది లేదు. ఆ తర్వాత కల్కి కోసం నాలుగేళ్లు కష్టపడ్డాడు. ఈ నాలుగేళ్లలో ఆయన పడిన కష్టమ్ థియేటర్స్ లలో కనిపిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) పేరుతో గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. కేవలం టాక్ మాత్రమే కాదు వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కేవలం మూడు రోజుల్లో రూ.555 కోట్లు దాటి సరికొత్త రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ అందుకున్న సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ పెట్టిన‌ ప్ర‌త్యేక పోస్ట్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాను ఈ సినిమా కోసం చెప్పులు అరిగిపోయేలా ప‌ని పనిచేశానని సింబాలిక్‌గా చెబుతూ.. తన అరిగిపోయిన చెప్పులు ఉన్న ఫోటోలను పంచుకున్నాడు. ఈ పోస్ట్‌కు ఇది సుదీర్ఘ రహదారి అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఈ పోస్ట్ ఫై నటుడు బ్రహ్మాజీ స్పందించారు. ‘తెలుగు సినిమా అనుకుంటే వరల్డ్ సినిమా తీశారు. నాగ్ అశ్విన్ గారు మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకుంటా. థాంక్స్ ప్రియాంక, స్వప్న. మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష’ అని పేర్కొన్నారు.

Read Also : CM Chandrababu : ప్రజలు 1995 వింటేజ్ చంద్రబాబుని చూస్తారు