Site icon HashtagU Telugu

Boys Hostel: బాయ్స్ హాస్టల్ బంపర్ ఆఫర్, బై వన్ గెట్ వన్ టికెట్

Boys Hostel

Boys Hostel

బాయ్స్ హాస్టల్ చిత్రం ఈ శనివారం తెలుగులో విడుదలైంది. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వినిపించింది.  ప్రేక్షకులను ఆకర్షించడానికి, మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఒక టికెట్ ఆఫర్‌తో ముందుకు వచ్చారు. ఈ బుధవారం అంటే ఈరోజు విద్యార్థులు ఈ బై వన్ గెట్ వన్ టికెట్ ఆఫర్‌ ఇచ్చింది. స్నేహితులు, యూత్ గ్యాంగ్‌తో ఈ సినిమా చూడొచ్చు. ఈరోజు రక్షా బంధన్ సెలవుదినం, విద్యార్థులు తమ స్నేహితులతో కలిసి సినిమా చూడాలని భావిస్తున్నారు. ఈ షోలతో పాజిటివ్ మౌత్ టాక్ ఈ వారాంతంలో సినిమా ఊపందుకుంటుందని మేకర్స్ ఆశిస్తున్నారు.

దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి మంచి బజ్ తీసుకురావడానికి ఆసక్తికరమైన ప్రకటన చేసాడు. “సినిమాలో మంచి కథ ఉన్నప్పటికీ, ఫేమస్ హీరోలు నటించలేదు. చాలామంది రంగస్థల నటులు నటించిన తొలి సినిమా ఇదేనని ఆశిస్తున్నాను” అని నిర్మాత సుప్రియ అన్నారు.  “ఇలాంటి సినిమాలు దొరకడం చాలా అరుదు. మా తాత ఏఎన్‌ఆర్‌కి కూడా శివ కథ నచ్చలేదు. కానీ అది ట్రెండ్‌సెట్టర్‌గా మారింది. మంచి స్క్రిప్ట్‌ల కోసం వెతుకుతున్నాం. నితిన్ కృష్ణమూర్తితో స్ట్రెయిట్ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అన్నారు.

Exit mobile version