Site icon HashtagU Telugu

BoyFriend For Hire: ‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ ట్రైలర్ చూశారా?

Boy Friend

Boy Friend

‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్‌ ట్రైలర్‌ ఈరోజు విడుదలైంది. దీంతో కథపై క్రేజీ పెరిగింది. యూత్ టార్గెటెడ్ ట్రైలర్ కంటెంట్ తో ఆకట్టుకుంది. ఒక అబ్బాయి చాలామందికి బాయ్‌ఫ్రెండ్‌గా మారడం నుండి, అతని జీవితంలోని ఆసక్తికరమైన దశలను చూడవచ్చ. ఇది వినోదం మరియు భావోద్వేగాల కలయిక. ఈరోజు విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ చాలా యూత్‌ఫుల్‌గా ఉంది. యువ ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించేలా ట్రైలర్ ఉంది. పాజిటివ్ మూడ్ తో ఈ మూవీ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.

మాళవిక మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం యూనిట్ అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. చాలా యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందించాం. ఇందులో దివ్య అనే పాత్రలో కనిపిస్తా. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. విశ్వంత్ గమంచి కోస్టార్. చాలా ప్రోత్సహించారు. అక్టోబర్ 14న సినిమా వస్తోంది. అందరూ తప్పకుండా చూడాలి” అని కోరారు.

దర్శకుడు సంతోష్ కంభంపాటి మాట్లాడుతూ.. ఒక కొత్త దర్శకుడికి కావాల్సిన మంచిన్ కథ, మంచి ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాతో నాకు దొరికాయి. వేణు మాధవ్ , నిరంజన్ గారు చాలా ప్రోత్సహించారు. సినిమాని ఎక్కడా రాజీ పడకుండా తీశారు. హీరో విశ్వంత్ ప్రోత్సాహం మర్చిపోలేను. ఈ సినిమా కోసం ది బెస్ట్ వర్క్ ఇచ్చాం. అక్టోబర్ 14న సినిమా వస్తోంది. సినిమా అందరూ థియేటర్ లో చూసి మమ్మల్ని ఆదరించాలి” అని కోరారు.

Exit mobile version